Ram Mandir : రామజన్మభూమిలో రాములోరి విగ్రహ ప్రతిష్టాపన సమయం దగ్గరవుతోంది. 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేయనుండటంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. డివైడర్లకు ఇరువైపులా నాటుతూ ఆహ్లాదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నారు. నగరమంతా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. రామ్ లల్లా విగ్రహానికి పట్టాభిషేకం చేసే ఆచారాలు నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 22 వరకు మహాయజ్ణం చేయనున్నారు. తరువా భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. మహా సంప్రోక్షణ కోసం అయోధ్యకు రానున్న భక్తులకు అన్ని వసతులు కల్పించనున్నారు. రామజన్మ భూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో వసతులు కల్పిస్తున్నారు. రామాయణ కాలం నాటి చెట్లు నాటుతున్నారు. అంతరించి పోతున్న సంపదను కాపాడేందుకు ఆలయ ట్రస్ట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి దాదాపు 4 వేల మంది అతిథులు రానున్నారు. 10 నుంచి 15 వేల మందికి వసతి కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా వస్తున్న వారికి ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. రామజన్మ భూమిలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించాలని యావత్ దేశం ఆశిస్తోంది.
500 ఏళ్ల పోరాట ఫలితంగా నిర్మిస్తున్న రామజన్మ భూమిలో నిర్మించే రామాలయం అందరిలో ఆసక్తి పెంచుతోంది. ఎందరో మంది అతిథులు విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించాలని చూస్తున్నారు. రాముడి విగ్రహ ప్రతిష్టాపనను విజయవంతం చేయాలని భావిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.