24 C
India
Sunday, October 11, 2026
More

    Bittiri Satti : బిత్తిరి సత్తి కొన్న కారు చుట్టూ వివాదం ఏంటి

    Date:

    Bittiri Satti :

    చేవెళ్ల రవికుమార్ అంటే తెలియకపోవచ్చు గానీ బిత్తిరి సత్తి అంటే మనందరికీ తెలిసిన వ్యక్తే. పొలిటికల్ నుంచి సినిమా వరకు అందరు సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ తాను కూడా సెలబ్రెటీగా మారిపోయాడు. ‘V6 తీన్మార్’ వార్తలతో ఫేమ్ అయినా బిత్తిరి సత్తి అనతి కాలంలోనే బాగా ఎదిగారు. ఎంతటి ఈవెంట్ అయినా ఆయన వస్తే సందడి పెరగాల్సిందే. ఆయన లేకుంటే వెలతి ఇట్టే కనిపిస్తుంది. బిత్తిరి సత్తిది కళాకారుల కుటుంబం కావడంతో సహజంగానే ఆయన అన్ని క్యారెక్టర్స్ లో ఒదిగిపోతాడు.

    ఈ మధ్య స్టార్ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కోసం బిత్తిరి సత్తిని ఎక్కువగా ఇన్వైట్ చేస్తున్నారు. ఆయన వచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఇక సినిమా జనాల్లోకి ఈజీగా వెళ్తుందని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు నమ్ముతారు. అప్ కమింగ్ సినిమాల ప్రమోషన్లకు కూడా ఆయన హోస్ట్ గా వస్తున్నారు. ఇక ఈ మధ్య ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు దాని పేరు ‘బిత్తిరి సత్తి-రవికుమార్’. ఇందులో ఆయన పెంటయ్య పాత్రలో షార్ట్ వీడియోస్ చేస్తున్నాడు. ఈ చానల్ కు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన వీడియోకు ఒక్క రోజులోనే దాదాపు లక్ష వ్యూవ్స్ పైన వస్తుంటాయి. ఇప్పటికి ఆయన ఛానల్ కు దాదాపు 6.5 లక్షల మంది సబ్‌స్క్రిబ్‌సర్స్ ఉన్నారంటే ఆయన ఫేం ఎటువంటిదో ఇట్టే అర్థం అవుతుంది.

    ఇక, ఆయన ఈ మధ్య ఒక కారు తీసుకున్నాడు. కారు అంటే అదేదో మధ్య తరగతి వాడు వాడేది కాదు. పక్కా సెలబ్రెటీలు వాడే కారు ‘రేంజ్ రోవర్’ తీసుకున్నాడు. దీని చుట్టూ వివాదం నడుస్తోంది. కారు కొన్నప్పుడు ఆయన పెట్టిన పోస్టులకు బాగానే లైకులు వచ్చాయి. కానీ అంతే స్థాయిలో వివాదాలు కూడా కమ్ముకుంటున్నాయి. బిత్తిరి సత్తి పొలిటికల్ గానే కాకుండా అన్ని రంగాల్లో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన కారు కొనడంతో పొలిటికల్ గా బాగా సంపాదిస్తున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన కారు చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నా ఆయన మాత్రం వాటిపై స్పందించడం లేదు. హోస్ట్ గా, ఛానల్ ద్వారా బిత్తిరి సత్తి చాలానే సంపదిస్తున్నారు. కారు కొనుక్కోలేడా? అన్న కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు.

    https://www.instagram.com/reel/CuSvrT7rqWh/?fbclid=IwAR0g3olCdCF5JHrV_0o4Qj_aORZDpfN4zopq8B_oze5sfg2qzEyrG7g_B08

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bittiri Satti into BRS : బీఆర్ఎస్ లోకి బిత్తిరి సత్తి? కన్ఫమ్ అంటూ కామెంట్లు..

    Bittiri Satti into BRS : బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల...