
Tholi Ekaadhasi Procedure :
తొలి ఏకాదశి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారు. దీన్ని దేవ శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజే విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడు. నాలుగు నెలల తరువాత అంటే నవంబర్ లో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకే ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస దీక్షగా కూడా చెబుతుంటారు. చాలా మందికి తెలియదు ఏకాదశి అంటే మాంసాహారం తినడమే అనుకుంటారు. విచ్చలవిడిగా చికెన్, మటన్ లాగించేస్తుంటారు. కానీ ఇది పవిత్రమైన పండగ.
తొలి ఏకాదశి రోజు కొన్ని పనులు చేయకూడదు. మాంసం తినరాదు. మద్యం తాగొద్దు. ఉపవాసం చేయడం చాలా మంచిది. జాగరణ చేస్తే ఇంకా పుణ్యం వస్తుంది. ఒకవేళ తిన్నా ఉడకనివి, వండనివి తినాలి. పుచ్చకాయ, బూడిది గుమ్మడికాయ, ఉసిరి, జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మినుములతో చేసినవి కూడా తినకూడదు.
అబద్దాలు ఆడరాదు. చెడు ఆలోచనలు చేయకూడదు. దైవభక్తిలోనే కాలం గడపాలి. ధ్యానం చేయడం చాలా మంచిది. ఇలా తొలి ఏకాదశి రోజు ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారికి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఇంకా రాత్రి పూట జాగారణ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇలా తొలి ఏకాదశి రోజు మనం ఆచరించే వాటిలో ఇవి ముఖ్యమైనవి. దేవుడికి నిష్టగా పూజలు చేస్తే ఎంతో మంచిది.
ఇంకా తొలి ఏకాదశి రోజు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది మోక్షం సిద్ధిస్తుంది. ఏకాదశి రోజు బ్రహ్మచర్యం పాటించాలి. శ్రీమహావిష్ణువును పూజించేటప్పుడు తులసి ఆకులను వినియోగించడం మంచిది. ఇలా తొలి ఏకాదశి రోజు మనం చేయకూడని, చేసే పనులు తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. ఏకాదశి రోజు చేసే పనులు చేయడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది.