
RGV silence : సంచలన దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. తనదైన శైలిలో రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను సినిమాగా తెరకెక్కించడం ఆయనకున్న అలవాటు. పరిటాల రవి ఉదంతాన్ని సైతం రక్త చరిత్రగా తీర్చిదిద్దారు. అలా జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని సినిమాలు నిర్మించడంలో ఆయనకు ఆయనే పోటీ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎంపీ కుటుంబం కిడ్నాప్ పై ఎందుకు మౌనం వహిస్తున్నారు.
ఏ ఘటన జరిగినా స్పందించే వర్మ దీనికి మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు. సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్లు ఉన్నా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు. తాను కూడా అధికార పార్టీకి చెందిన వాడినే అనే ఉద్దేశంతోనే దీనిపై మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో స్పందించే ఆర్జీవీ దీనిపై ఎందుకు తటస్థంగా ఉంటున్నాడు. ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం అచ్చం సినిమా కథలాగే ఉండటం గమనార్హం.
విశాఖ ఎంపీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేసిన ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కానీ దీనిపై ఆర్జీవీ ఇంతవరకు కనీసం ట్విట్టర్ వేదికగా కూడా స్పందించలేదు. అదే ఇతర వ్యవహారాలైతే క్షణాల్లో స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని దుమారం చేసే దర్శకుడు ఇప్పుడు ఎందుకు మౌన ముద్ర వేస్తున్నాడు. దీనిపై నోరు విప్పాల్సిందే. ఈ కథను సినిమాగా తీయాల్సిందేనని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై వర్మపై పలు కామెంట్లు వస్తున్నాయి. యథార్థ గాథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే ఆర్జీవీ దీని విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు. పార్టీ ఏదైనా తన సహజ ధోరణి మార్చుకోవద్దు. నిజాయితీగా సినిమా తీయడం ఆయన కర్తవ్యం. దీనిపై మౌనం వహించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ అయితే ఒకలా ప్రతిపక్ష పార్టీలైతే మరోలా వ్యవహరించే ఆయన సంకుచిత ధోరణి మారాలి.






