36.9 C
India
Tuesday, April 21, 2026
More

    కాపులపై అంబటి వ్యాఖ్యల వెనుక అంతర్యమేమిటీ..

    Date:

    Court case file on minister ambati rambabu
    ambati rambabu

    కాపులపై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. రాష్ర్టంలో  ఎక్కువ శాత ఉన్న కాపులను ప్రసన్నం  చేసుకుంటే చాలు ఇజీగా గెలువవచ్చు అనే భావనలో ఉంటాయి రాజకీయ పార్టీలు.. 2014 లో ఆంధ్రలో ఉన్న కాపులు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్లు కావాలనీ ఉద్యమం కూడా జరిగింది. 2019లో కాపులు వైసీపీ వైపు మొగ్గడంతో వైసీపీ గెలిచింది.

    అంతబలం ఉన్న కాపులను హేళన చేస్తూ ఒక్క కాపు ఓటు కూడా వైసీపీకి రాకుండా అంబటి రాంబాబు కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు ఆయనపై వ్యక్తమవుతున్నాయి. కాపులపై అనుచిత వ్యాఖ్యలు తరచూ చేస్తూండటమే దీనికి కారణం. ఆయన రాజకీయమో లేకపోతే.. జగన్మోహన్ రెడ్డి వద్ద బానిసత్వం కోసం కాపులను దారుణంగా అవమానిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన ఎక్కడ మాట్లాడినా కాపు కులం గురించే మాట్లాడుతున్నారు. వారు పవన్ వెంట వెళ్తున్నారని కానీ పవన్ సీఎం కారని.. చంద్రబాబు అవుతారని.. కాపులందర్నీ పవన్ అమ్మేస్తున్నారని ఆయన అంటున్నారు. అంబటి వ్యాఖ్యల ఉద్దేశం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాపులు జనసేనకు ఓట్లేసినా పవన్ సీఎం కారని చెప్పడం ఉద్దేశం. అందుకోసం దారుణమైన పదజాలాన్ని వాడుతున్నారు. కాపులు అమ్ముడుపోతారన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాపుల్ని చితికిపోయేలా చేసిన జగన్ సర్కార్ – పట్టించుకోని అంబటి ! సీఎం జగన్ కాపులకు ఘోరమైన అన్యాయం చేశారు.

    కాపులకు వైసీపీ ప్రభుత్వం చులకనగా చూస్తుండడంకూడా మరో కారణం  చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు కూడా వైసీపీ ప్రభుత్వం తొలగించింది.  కాపు కమ్యూనిటీకి అరకొరగా ఇచ్చే పథకాలు తప్ప ఇంకేమీ ఇవ్వడంలేదు. ఉపాధి హమీ పథకాలు లేకపోవడంతో కాపులు ఆర్థికంగా దిగజారిపోతున్నారు. విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాల్లో వారి ప్రమాణాలు పడిపోయాయి. ఇవన్నీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినా కాపులపై పగబట్టినట్లుగా అంబటి రాంబాబు వ్యవహరిస్తున్నారు.

    అయినా జగన్ కు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోలేని అంబటి కాపుల గురించి మాట్లాడడం ఏంటని కాపు నేతలు అంటున్నారు. గతంలో పవన్ అభిమానించినా కాపులు వైసీపీ ఓటు వేశారు. ఇప్పుడు జగన్ కు ఓటేసే పరిస్థితి లేదని అర్థం అయ్యే.. ఇప్పుడు వారినిరెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.  ఆయన తీరు వల్ల కాపులు వైసీపీకి పూర్తిగా దూరం అవుతున్నారని..ఇది మాస్టర్ ప్లానేమో అన్న అనుమానాలు కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India alliance : ఇండియా కూటమిలోకి వైసీపీనట..

    India alliance : అంతన్నారు.. ఇంతన్నారు.. సింహం సింగిల్ గా వస్తుందన్నారు. చివరకు...

    Balineni : బాలినేనికి నచ్చ చెప్తున్న వైసీపీ అధినాయకత్వం.. వరుసగా కలుస్తున్న అధినాయకులు.. మనసు మార్చుకుంటారా?

    Balineni : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

    Anchor Shyamala : రోజా ప్లేసులో యాంకర్ శ్యామల.. కీలక పదవి కట్టబెట్టిన వైసీపీ

    Anchor Shyamala : 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వైఎస్సార్సీపీ...

    Jagan Strategy : కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్న జగన్.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు

    Jagan Strategy : ఏపీ ఎన్నికలకు ముందు వైనాట్ 175 నినాదంతో...