21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Silence of KCR : ప్రతిపక్షాల సభలు, మార్చ్ లు సక్సెస్ అవుతున్నా.. అధినేత మౌనం వెనుక అర్థం?

    Date:

    Silence of KCR
    Silence of KCR

    Silence of KCR : తెలంగాణలో రాను రాను ఎన్నికల హీట్ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వంలోకి వచ్చిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఈ సారి కూడా వస్తుందా..? అన్న అనుమానాలు కొనసాగుతుండగానే.. కాంగ్రెస్, బీజేపీ సభలు, సమావేశాలు, నిరుద్యోగ మార్చ్ లు నిర్వహిస్తూ సక్సెస్ కూడా చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ‘యువ సంఘర్షణ సభ’ పెట్టిన కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని తీసుకువచ్చి సభను భారీగా సక్సెస్ చేసింది. ఇక నిన్నటికి నిన్న బీజేపీ చీఫ్ సంగారెడ్డిలో నిర్వహించిన ‘నిరుద్యోగ మార్చ్’ కూడా సక్సెస్ అయ్యింది. తామంటే తాము అధికారంలోకి వస్తామంటూ పోటా పోటీగా సభలు, సమావేశాలు పెడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్.

    అయితే బీఆర్ఎస్ మాత్రం తమను తమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముతున్నాయి. రాను రాను అధినేత కేసీఆర్ మౌనంగా (Silence of KCR) ఉండడం బీజేపీ, కాంగ్రెస్ దూసుకుపోతుండడంతో పార్టీ నాయకుల్లో కొంచెం నైరాశ్యం కనిపిస్తున్నా కేసీఆర్ దాన్ని కవర్ చేస్తున్నారు. ఇక వన్ మ్యాన్ షో చేస్తున్న కేటీఆర్ వారికి బూస్ట్ ఇస్తూ అప్పుడప్పుడూ లేపుతున్నాడు. ఇప్పటికీ తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, టెన్త్ పేపర్ లీకేజీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, పథకాల్లో ఎమ్మెల్యేల, పార్టీ నాయకుల చేతివాటం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ తమను అగాధంలోకి నెడతాయా..? అని పాలకపక్షం ఆందోళనలో ఉంటే ప్రతిపక్షానికి మాత్రం కావాల్సినంత స్టఫ్ దొరికినట్లయ్యింది.

    కాంగ్రెస్, బీజేపీ సక్సెస్ పై బీఆర్ఎస్ పార్టీలో బాహాటంగానే చర్చలు జరుగుతున్నాయి. మొదటి సారి తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వస్తే.. రెండో సారి సరైన ప్రతిపక్షం లేక అధికారం చేబట్టామని. ఇక ఈ సారి ఆ ఆటలు సాగేలా లేవని అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఫుల్ జోష్ లో పని చేస్తుంటే తాము ఏం చేయాలని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు గెలిపిస్తాయన్న నమ్మకం రాను రాను కనుమరుగువుతూ వస్తోందని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు సరైన వాయిస్ కూడా లేకపోవడంతో ఈ సారి ఎలా నెగ్గుకు రావాలని యోచిస్తున్నారు. అధినాయకుడు కేసీఆర్ మాత్రం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakalamma : మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదం

    కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత Sakalamma : తెలంగాణ మాజీ...

    Supreme Court : ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్.. పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

    Supreme Court : ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్...

    High Court : బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చండి.. హైకోర్టు కీల‌క ఆదేశాలు

    High Court Order : భారత రాష్ట్ర సమితికి సంబంధించి పార్టీ...

    KCR : సార్లంతా ఫుల్ బిజీ.. ‘కారు’ స్టీరింగ్ పట్టేవారేరి?

    KCR  : ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన కర్తగా...