
WhatsApp : వాట్సాప్ అనేది ప్రస్తుతం ట్రెండింగ్ యాప్. ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ అనేది కామన్ అయిపోయింది. ఇంకా యూజర్ల సంఖ్య పెంచుకుంటూ పోతూనే ఉంది. దీంతో వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను వాట్సాప్ తెస్తూనే ఉంది. అయితే మరొక కొత్త ఫీచర్ తో వాట్సాప్ ఇప్పుడు మన ముందుకొచ్చింది. ఇకపై ఫోన్ నంబర్ తో కాకుండా యూజర్ నేమ్ తో మనకు కనిపించబోతున్నది.
ఇప్పటివరకు వాట్సాప్ ప్రొఫైల్ వివరాల్లో మన ఫొటోతో పాటు పేరు, నంబర్ మాత్రమే కనిపించేంది. ఇకపై వీటితో పాటు యూజర్ నేమ్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఈ యూజర్ నేమ్ ను మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. @ ఈ గుర్తుతో మొదలయ్యే ఈ యూజర్ నంబర్ ను మనకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకునే అవకాశం ఉంది. దీంతో ఇకపై మనం కొత్త వారికి ఫోన్ నంబర్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఈ యూజర్ నేమ్ ద్వారానే లింక్ కావచ్చు. తద్వారా చాట్ చేసుకోవచ్చు.
అయితే ఇప్పటికే ఇది టెలిగ్రామ్ యాప్ లో ఇది అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ వినియోగదారులకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నదని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో వెబ్ సైట్ పేర్కొంది. అయితే ఈ విధానంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఫోన్ నంబర్ కు బదులు యూజర్ నేమ్ మంచి విధానమే అయినా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గాని దీని పనివిధానం తెలియదని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.