25.3 C
India
Tuesday, July 16, 2024
More

  Modi cabinet : ముంబై, హైదరాబాద్ సహా 5 నగరాలు ‘యూటీ’నా? మోడీ అత్యవసర సమావేశాల వెనుక కథేంటి?

  Date:

  Modi cabinet : ప్రత్యేక సమావేశాల తొలిరోజు ముగిసిన తర్వాత పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అంతకుముందు రోజు ప్రధాని మోడీ ఈ పార్లమెంట్ సెషన్ వ్యవధి తక్కువగా కుదించామని ప్రత్యేకమైన సమావేశాలని తెలిపారు. కానీ సందర్భానుసారంగా ఇందులో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇది “చారిత్రక నిర్ణయాల” సమావేశం అని అన్నారు. అంటే ఏదో బాంబు పేల్చబోతున్నట్టు సమాచారం.

  సమావేశం అజెండా తెలియనప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ప్రత్యేక సెషన్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించవచ్చని విస్తృతంగా ఊహాగానాలు వచ్చాయి. అంతకుముందు రోజు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

  లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంతో ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు పాత ప్రాంగణంలో జరిగిన ముఖ్యమైన చారిత్రక సంఘటనల గురించి ఆయన మాట్లాడుతూ రేపు కొత్త పార్లమెంటు భవనానికి సభా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ, పాత భవనం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. తన ప్రసంగంలో, సభా కార్యక్రమాలలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం మరియు సహకారాన్ని మోదీ ప్రస్తావించారు. దాదాపు 600 మంది మహిళా ఎంపీలు ఉభయ సభల గౌరవాన్ని పెంచారన్నారు.

  సాయంత్రం 6:30pmకు ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసర కేబినెట్ భేటీ సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దు సమయంలోనూ ఎక్కడ లీక్ కాకుండా పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశ పెట్టారు. సడెన్ గా ప్రకటించి షాక్ ఇచ్చారు.

  అయితే దేశంలో… ముంబై, హైదరాబాద్ సహా నాలుగు ప్రాంతాలను యూటీ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా పెనుదుమారం ఖాయం. కానీ ఈ బిల్లు బీజేపీకి బలం లేని రాజ్యసభలో వీగిపోవడం ఖాయం. అందుకే ఇలాంటి సాహసాలను ఎన్నికల ముందర మోడీ పెట్టకోవచ్చని సమాచారం. కేవలం మహిళా బిల్లు ఇతర కీలక బిల్లుల కోసమే పెట్టినట్టు సమాచారం. ఎన్నికల ముందర ఆమోదించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

  Share post:

  More like this
  Related

  Pawan : పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్.. లక్ష కోట్ల ఆదాయం ఉండే కంపెనీ కోసం పోరాటం!

  Pawan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం...

  CM Relief Fund : ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు

  CM Relief Fund : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

  AP Government : వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

  AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు...

  Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

  Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Modi : ప్రపంచానికి భారత్ బౌద్ధానిచ్చింది.. యుద్ధాన్ని కాదు: మోదీ

  Modi : ప్రపంయానికి భారత దేశం బౌద్ధాన్నిచ్చిందని పీఎం మోదీ అన్నారు....

  Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

  Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను...

  CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

  CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

  Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

  Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...