Vaishnavi Remuneration:
రామ్ పోతినేనికి విపరీతమైన ఫ్యాన్ అంట ‘బేబీ’ వైష్ణవి. ఈ విషయాన్ని ఆమెనే స్పీచ్ లో చెప్పింది కూడా. ఆయనతో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని కూడా చెప్పింది. అడిగింతే తడువుగా ‘పూరి’ తథాస్తు అన్నట్లున్నారు. తన సినిమాలో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఎనర్జిటిక్ హీరోగా రామ్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఏ పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు ఆయన. ఆయన హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఫుల్ మాస్ అయిన ఈ మూవీలో రామ్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. 2019తో ఈ సినిమా రిలీజ్ కాగా బాక్సాఫీజ్ కలెక్షన్లలో రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారన పూరీ జగన్నాథ్.
‘ఇస్మార్ట్ శంకర్ 2’కు సంబంధించి ఇప్పటికే నటీనటుల ఎంపిక కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ రామ్ సరసన ‘బేబి’ హీరోయిన్ గా నటించనుందట. ఈ మేరకు పూరీ ఒకే అని కూడా అనేశారని చెప్పుకుంటున్నారు. రామ్ ఎనర్జీకి వైష్ణవి బాగా సూట్ అవుతుందని ఆమెనే తీసుకోవాలని అనుకున్నారట డైరెక్టర్.
హీరోలకే కాదు.. హీరోయిన్స్ కు కూడా మంచి మంచి డైలాగులు రాస్తుంటాడు పూరీ జగన్నాథ్. ఇటు నటన, అటు డైలాగులు, డైరెక్టర్, హీరో ఇలా అన్నింట్లో కూడా సెకండ్ సినిమాకు భారీ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు ఆమె అభిమానులు, ఇండస్ట్రీలోని సహ నటులు. ఈ సినిమాకు సంబంధించి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. రూ. కోటి వరకు అడుగుతుందట. దానికి పూరి టీం కూడా పచ్చ జెండా ఊపినట్లు వినినిపిస్తుంది. ఇదే రెమ్యునరేషన్ కు బాలీవుడ్ భాములు వస్తున్నా.. మన తెలుగు అమ్మాయికి చక్కటి ఛాన్స్ ఇవ్వడం బెటరని పూరి అనుకుంటున్నారట.
బేబీ యాక్టింగ్ తో ఆడియన్స్ కు బాగా దగ్గరైంది వైష్ణవి. దీంతో టాలీవుడ్ లో ఆఫర్స్ ఇప్పుడు ఆమె వైపునకు చూస్తున్నాయి. పూరీ సినిమా కూడా పూర్తయితే ఆమెరేంజ్ మరింత పెరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. రామ్ అండ్ పూరీ కాంబోలో బిగ్గెస్ట్ హిట్ చిత్రం కాగా రూ.100 కోట్ల కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాలంటే 2024వరకు వేచి చూడాల్సిందే.