Home EXCLUSIVE ‘Salar 1’ : ‘సలార్ 1’ రన్ టైం ఎంతంటే?

‘Salar 1’ : ‘సలార్ 1’ రన్ టైం ఎంతంటే?

57
salar 1
salar 1

‘Salar 1’ :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సలార్’. ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. హ్యూజ్ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తుంది. కేజీఎఫ్ తో పాన్ ఇండియాలో క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో దాన్నిమరింత పెంచుకోవాలని చూస్తున్నాడు.

ఈ మూవీ వచ్చే నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి తోడు టీజర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా ఆకాశాన్ని తాకుతోంది. ఎక్కడికక్కడ రేట్లు చుక్కలను  అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రన్ టైంపై ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సలార్ కు ఇప్పటికే సీక్వెల్ ను కూడా ప్రకటించారు ప్రశాంత్ నీల్. అయితే పార్ట్ 1 లెంత్ ఎక్కువ అయినా కట్ చేసి పార్ట్ 2లో వేసే అవకాశాలు ఉన్నాయి. పార్ట్ 1లో పది నిమిషాలు తొలగించినట్లు టాక్ వినిపిస్తుంది.

సలార్ ర‌న్ టైం 3 గంటలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 3 గంటల 20 నిమిషాలు అంటే 200 నిమిషాల రన్ టైం కాగా.. ఇందులో దాదాపు 10 నిమిషాల కట్ చేసి పార్ట్ 1 ఫైనల్ రన్ టైంగా లాక్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. స‌లార్-1 ర‌న్ టైం 185 నుంచి 190 నిమిషాల మధ్యన ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కేజీఎఫ్ కు ప్రొడక్షన్ చేసిన ‘హోంబ‌లే ఫిలింస్’ నిర్మిస్తున్నారు.