Medaram Jatara : మేడారం మహా జాతర సమ్మక్క ఆగమనంతో తారస్థాయికి చేరుకుంటుంది. అయితే చిలకలగుట్ట పై నుండి సమ్మక్కను గద్దెల మీదకు తీసుకు వచ్చే వేడుక కన్నుల పండుగగా, ఎంతో ఉద్విగ్నంగా కొ నసాగుతుంది. మేడారం జాతరలో చిలకలగుట్ట కు ఒక ప్రముఖమైన స్థానం ఉంది.
అసలు చిలకలగుట్ట పైన సమ్మక్క ఎక్కడ ఉంటా రు? ఎందుకు ఎవరూ చిలకలగుట్ట పైకి వెళ్లే సా హసం చేయరు? చిలకలగుట్ట పైన కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క కు సంబంధించిన రహ స్యాన్ని సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ వివరించారు.
మేడారం మహా జాతర లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలకలగుట్ట పై నుండి సమ్మక్కను అధికార లాంచనాలతో, ఉన్నతాధికారులు తుపా కీలతో గాలిలో కాల్పులు జరిపి సాదరంగా స్వాగ తిస్తారు. అమ్మవారిని తీసుకురావడానికి వెళ్ళే సమ్మక్క పూజారులు పూర్తిగా అమ్మవార్లను ఆవా హనం చేసుకున్న వారిగా మారిపోతారు. ఎవరి తోనూ మాట్లాడరు.. ఎవరు చెప్పింది వినరు. అక్కడ అధికారులైనా, మంత్రులైనా, అందరూ వారికి సమానమే.
రెండేళ్లకు ఒకసారి చిలకలగుట్ట పైకి సమ్మక్క పూ జారులు మాత్రమే వెళ్లి అమ్మవారిని తీసుకు వస్తా రు. మళ్లీ రెండేళ్ల వరకు గుట్ట ప్రాంతం అంతా నిషే ధిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్లే సాహసం చేయరు. అమ్మవార్లను తీసుకువచ్చే పూజారులు కూడా అక్కడకు వెళ్లలేరు.
రెండేళ్లకు ఒకసారి మాత్రమే, మాఘ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని తీసుకువచ్చే క్రమంలో, వారం రోజులపాటు అమ్మవారిని ఆవాహనం చేసిన త మకు చిలకలగుట్ట పై మార్గం కనిపిస్తుందని, మిగ తా రోజుల్లో ఎవరికి ఆ మార్గం కనిపించదని.. ఇదే చిలకలగుట్ట పై సమ్మక్క అసలు రహస్యం అని చెబుతున్నారు.
చిలకలగుట్ట పై అమ్మవారిని చేర్చే ప్రాంతం ఆ స మయంలో తప్ప, మిగతా సమయాల్లో తమకు గుర్తు ఉండదని, మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తమ అమ్మవారే బాటను చూపిస్తారని చెబుతు. న్నారు. ఇప్పటివరకు ఎవరు చిలకలగుట్ట పై అమ్మవారు ఎక్కడ ఉంటారో చెప్పలేకపోయారని, జాతర స మయంలో తప్ప, మిగిలిన సమయాల్లో తాము కూడా అక్కడకు చేరుకోలేమని చెబుతున్నారు.
ఒకవేళ ఎవరైనా గిరిజన సాంప్రదాయాలను, నియ మ నిష్టలను తప్పి అక్కడికి వెళ్లాలని ప్రయ త్నస్తే వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొని, ఎ లాం టి ఫలితం లేకుండా తిరిగి రావాల్సిందేనని సిద్దబో యిన అరుణ్ చెబుతున్నారు. ఎంతో మహిమ ఉ న్న సమ్మక్క తల్లి గిరిజనులే కాకుండా గిరిజ నేత రులను కూడా తన మహిమతో కాపాడుతుందని చెప్పడానికి కోట్లాదిగా వచ్చే భక్తజనమే నిదర్శన మని సమ్మక్క పూజారి అరుణ్ వెల్లడించారు. చిలకలగుట్ట యొక్క అసలు రహస్యాన్ని, అమ్మ వారి మహత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.