Chandrababu Detention : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చనే నడుస్తున్నది. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు పోస్టులతో నింపేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం, సీఐడీ ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ముఖ్యంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి మాత్రమే ఈ పోస్టుల ద్వారా బయటకు వస్తున్నది. అసలు తప్పెక్కడుంది.. ఎందుకీ నిర్బంధం అంటూ అంతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ వారు ట్యాగ్ చేస్తున్నారు. లేని స్కాంను సృష్టించి, అధికారం అండతో ఇలా చేస్తున్నారని విద్యావంతులంతా అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యువతకు నైపుణ్యం పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. మొత్తంగా రాష్ర్ట వ్యాప్తంగా 42 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సెంటర్లలో సుమారు 2 లక్షల మంది శిక్షణ పొందారు. సుమారు 70 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని అధికారిక లెక్కల ప్రకారమే ఉంది.
ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ తప్పెక్కడుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తప్పెక్కడుంది.. ఎందుకీ నిర్బంధం అంటూ పెట్టిన పోస్టర్ ను తెలుగు ప్రజలను ఆలోచింపజేసేలా ఉంది. ఇక జైల్లో పెట్టింది చంద్రబాబును కాదు.. జైల్లో పెట్టింది ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని అంటూ ఈ పోస్టర్ లో హైలెట్ చేశారు. ఏదేమైనా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలుగు వారే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా మండిపడుతున్నారు. రాష్ర్ట అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తిని కుట్రపూరితంగా జైల్లో పెట్టారని అంతా అభిప్రాయపడుతున్నారు.