12th Fail Record : మనదేశంలో సినిమాలకు కొదవే లేదు. ఎక్కువ సినిమాలు నిర్మించేది మనదేశంలోనే. అందులో మన తెలుగు సినిమాలే అత్యధికంగా వస్తాయి. గత ఏడాది విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచే సినిమాలెన్నో ఉన్నాయి. ఇందులో 12th ఫెయిల్ సినిమా అరుదైన ఘనత సాధించింది. దీంతో దానికి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 250 బెస్ట్ ఫిల్మ్స్ లిస్టులో ఈ సినిమా 50వ సథానంలో నిలిచిన ఏకైక భారతీయ సినిమాగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ (9.2) పొందిన చిత్రంగా రికార్డు కొల్లగొట్టింది. దీంతో సినిమా స్టాండర్డ్ ఏమిటో అర్థమవుతుంది. చిన్న కథాంశంతో తీసిన చిన్న సినిమాలే అద్భుతాలు చేస్తున్నాయి.
ఈ సినిమాలో మనోజ్ అనే వ్యక్తి ఐపీఎస్ ఎలా అయ్యాడనే కథాంతోనే సినిమా తెరకెక్కింది. చదువు ఆగిపోయిన ఎలా ముందుకెళ్లాడు. ఎలా విజయం సాధించాడనే కోణంలో తీసిన కథ అద్బుతంగా ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టి ఏకైక సినిమాగా సంచలనం కలిగించింది. ఇలాంటి చిన్న సినిమాలే ఆణిముత్యాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
ఐఎండీబీలో టాప్ లో నిలిచిన భారతీయ సినిమాగా రికార్డు కెక్కింది. దీంతో సినిమా కథ ప్రాధాన్యం సంతరించుకుంది. మంచి కథ కావడంతోనే ఇంతటి అరుదైన ఘనత సాధించింది. ఈ క్రమంలో సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి విజయం సాధించిన సినిమా ఇది రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. దీనిపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.