Chadra Babu : ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసులో చంద్రబాబును మరో రెండు రోజులు రిమాండ్ కు తరలించారు. ఆదివారం (సెప్టెంబర్ 24) వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఆయన చేసిన పనులకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రోజుకో వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి వైరల్ చేస్తూనే ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు విడిపోయిన రాష్ట్రానికి కూడా ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన డెవలప్‌మెంట్ అంతా ఇంతా కాదు. ఆ కాలంలో ఎవరూ సాహసించనంతగా ఆయన మైక్రోపాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిసి సాంకేతికతను అందరికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలని అనుకున్నారు. ఆ దిశగా సక్సెస్ కూడా అయ్యారు. వందలాది మంది తెలుగు వారు నేడు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు స్థాపించి సక్సెస్ అవుతున్నారంటే అదంతా చంద్రబాబు దయ అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. గౌరవంగా తలెత్తుకొని జీవించాలని ఆయన ఎప్పుడూ కోరేవారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా మొదటి ప్రియారిటీగా తెలుగువారికే ఇచ్చేలా చంద్రబాబు కార్పొరేట్ సంస్థలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఏళ్ల నుంచి ఆయన తెలుగు నేలకు, తెలుగు ప్రజలకు, తెలుగు సమాజాలకు ఎనలేని సేవ చేస్తూనే ఉన్నారు. నేడు ఆయన జైలులో మగ్గుతుంటే తెలుగు సమాజమే కాదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎటువంటి నేరం చేయలేదని, కావాలనే జగన్ ప్రభుత్వం ఆయను ఇబ్బంది పెడుతుందని మండిపడుతున్నారు.