
grow in life : ఆచార్య చాణక్యుడు మనిషి జీవితం గురించి ఎన్నో మార్గాలు సూచించాడు. కష్టాలు వస్తే ఎలా? డబ్బు సంపాదించడం ఎలా? డబ్బు ఎలా ఖర్చు చేయాలి? అనే వాటిపై కూలంకషంగా వివరించాడు. మనిషి డబ్బు సంపాదించే క్రమంలో ఎలా వ్వవహరించాలి? సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేయాలి? అని తెలియజేశాడు. జీవితంలో ఎదగాలంటే ఏం చేయకూడదో సూచించాడు.
మనం సంపాదించే డబ్బు నైతికంగా సంపాదించి అయి ఉండాలి. అనైతికంగా, అక్రమంగా, అన్యాయంగా సంపాదించే డబ్బు ఎప్పటికి నిలవదు. ఎప్పుడు కూడా న్యాయబద్ధంగానే డబ్బు సంపాదించాలి. అన్యాయంగా చేస్తే అది మనకు కీడు చేస్తుంది. అందుకే ధర్మబద్ధమైన సంపాదనే సరైనది. అక్రమాల ద్వారా సంపాదించడం మంచిది కాదు.
మనం చేసే పనిలో నైపుణ్యం పెరిగితే మనకు మంచి విలువ ఉంటుంది. మనిషి నైపుణ్యాలు పెంచుకుంటే కెరీర్ ఎదుగుతుంది. దీంతో సంపాదన కూడా పెరుగుతుంది. విద్య, నైపుణ్యంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. ఇలా నిరంతరం నేర్చుకోవడం ద్వారా జీవితంతో ఎదిగేందుకు ఆస్కారం ఏర్పడుతుందని చాణక్యుడు సూచించాడు.
మన వ్యక్తిగత లక్ష్యాలు, ఉద్దేశాలు, ఆశయాలు గోప్యంగా ఉంచుకోవాలి. మనం ఎంచుకున్న ప్రణాళికలను బహిర్గతం చేయడం మంచిది కాదు. ఒకవేళ ఎవరికైనా చెబితే మనకు నష్టం కలుగుతుంది. ఇది మన పురోగతికి ఆటంకంగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇలా చాణక్యుడు మనిషి జీవితంలో ఎదిగే క్రమంలో చేయకూడని తప్పులు సూచించాడు.