41.7 C
India
Thursday, May 14, 2026
More

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Date:

    Delhi election results 2025
    Delhi election results 2025

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా పోటీ పడటం, నిజమైన ప్రత్యర్థి ఎవరో గుర్తించడంలో అసమర్థత ఇవి అన్నీ కాంగ్రెస్‌ పార్టీని వెనుకకు నెట్టుతున్న అంశాలు.

    ప్రస్తుతం భారత రాజకీయాలలో బీజేపీతో పోటీ చేయాలంటే, విభజన కాదు, ఐక్యత అవసరం. కానీ కాంగ్రెస్‌ చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పోటీ పడుతూ, వారి బలం తగ్గించడానికి ప్రయత్నిస్తూ, అలాగా బీజేపీకి పరోక్షంగా లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో ఇది స్పష్టంగా కనిపించింది. కేజ్రివాల్‌ పార్టీతో కలిసి పనిచేయకపోవడం వల్ల బీజేపీకి ప్రత్యక్ష లాభం కలిగింది. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్ల తేడా కేవలం 2 శాతమే ఉంది. అదే కాంగ్రెస్ కు 6 శాతం ఉంది. ఆప్ కాంగ్రెస్ కలిస్తే.. వీరే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కలవకుండా ఇలా ఓటమి తెచ్చుకున్నారు.

    చాలా మంది ప్రవాస భారతీయులు కూడా ఇదే రీతిగా కాంగ్రెస్‌ వ్యూహాన్ని తప్పుబడుతూ, ఇది బీజేపీని మరింత బలపరిచే విధంగా ఉన్నదని భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ఎదగాలంటే, అది బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రజలకు నమ్మకం కలిగించగలిగే విధంగా పనిచేయాలని సూచిస్తున్నారు..

    ఆంధ్రాలో జగన్ ను దెబ్బతీస్తే చాలు కాంగ్రెస్ బలపడుతుంది. అలానే ఉత్తరప్రదేశ్ లో ములాయం పార్టీని, బెంగాల్ లో మమతను, ఢిల్లీలో కేజ్రవాల్ ను ఇలా అందర్నీ దెబ్బతీస్తే చాలు. ఇటువంటి పరిణతి లేని ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో సున్నా సీట్లకు పడిపోతుంటే బాధ వేస్తుంది
    కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపుకు సహకరించటం తప్ప వేరే ఏ పని చేయటం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఎవరి మీద చేయాలి, దేనిమీద చేయాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా తయారు అయింది. ప్రతీ ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తోంది.. అంటూ ఎన్నారైలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    2025 AACTA ఇండస్ట్రీ అవార్డ్స్ గాలా – ప్రతిభకు ఘనత, విజయానికి స్మరణీయ రాత్రి

    AACTA : సిడ్నీ నగరంలో ఘనంగా నిర్వహించిన 2025 AACTA (ఆస్ట్రేలియన్ అకాడమీ...

    skater Tara Prasad : భారతీయ-అమెరికన్ స్కేటర్ తారా ప్రసాద్‌ను అభినందించిన ఆనంద్ మహీంద్రా

    Skater Tara Prasad : మహీంద్రా కంపెనీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త...

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...