
Ravi Babu Movies : తెలుగులో విలక్షణ దర్శకుల జాబితాలో అగ్రపీటం వెయ్యాల్సి వస్తే రవిబాబుకు వెయ్యాల్సిందే. ఆయన తీసిన సినిమలు ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. ‘అల్లరి’తో కామెడీ సినిమా తీసిన ఆయనే ‘అనసూయ’ లాంటి ఇన్వెస్టిగేషన్ సినిమా తీశాడు. ఆ తర్వాత ‘అవును’ లాంటి హర్రర్ మూవీ తీశాడు. ఇలా ఆయన సినిమాల గురించి చెప్పాల్సి వస్తే ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ వే.
అయితే రవిబాబు సినిమాల్లో ఇప్పటి వరకు ఎక్కువగా కనిపించిన లేడీ నటి పూర్ణ. ఇప్పటి వరకు దాదాపు 75 సినిమాలు తీసిన ఆయన ఒకే నటితో ఎక్కువగా తీసింది పూర్ణతోనే. రవిబాబు-పూర్ణ కాంబోలో ఎక్కువ సినిమాలు వచ్చాయి. వీటితో పాటు ప్రస్తుతం మరో సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉందని టాలీవుడ్ లో చర్చ కొనసాగుతోంది.
తన కొత్త సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ ఇస్తున్న ఆయన పూర్ణ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘పూర్ణతో లవ్ ఎఫైర్, ఇంకా.. ఇంకా.. ఏవేవో ఊహించుకోవద్దు. ఇండస్ట్రీలో ప్రతీ డైరెక్టర్, నటికి ఎలాంటి సంబంధం ఉంటుందో పూర్ణతో నాకు కూడా అలాంటి సంబంధమే ఉంది. చాలా వరకు డైరెక్టర్ చెప్పిన దానికంటే కూడా నటులు ఎక్కువగా పర్ఫామ్ చేస్తారు. కానీ ఈ విషయంలో పూర్ణ అందరికంటే ఎక్కువ చేస్తుంది. అందరి విషయంలో అది 10 శాతం ఉంటే పూర్ణ విషయానికి వస్తే అది 200 శాతం ఉంటుంది. అయితే సినిమాలో తన క్యారెక్టర్ కు పూర్తి స్థాయి న్యాయం చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే ఆమె ఒప్పుకుంటుంది. లేదంటే చేయనని చెప్పేస్తుంది’. అని చెప్పారు రవిబాబు.