
ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇప్పుడు వచ్చే రోగాలు అలా ఉంటున్నాయి. మనం ఏమరుపాటుగా ఉంటే మన ప్రాణాలే దహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అవుతోంది. దీంతో మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మనం రోజు తీసుకునే ఆహారాలను సరైన పద్ధతుల్లో తీసుకోవడం మంచిది. లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
మనం పాలు తాగిన తరువాత ఎలాంటి మాంసాహారాలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే అది మన ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతుంది. నెయ్యిని ఎప్పుడు ఇత్తడి పాత్రలో ఉంచకూడదు. దాన్ని స్టీలు పాత్రలోనే ఉంచుకోవాలి. పాలలో ఉప్పు కలుపుకుని తాగకూడదు. పాలల్లో బెల్లం, చక్కెర కానీ కలుపుకోవచ్చు. కానీ ఉప్పు వేసుకోవడం సరికాదు.
పెరుగన్నం చికెన్ కలుపుకుని తినొద్దు. ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. దోసకాయ, టమాటాల్లో నిమ్మరసం కలుపుకోవద్దు. టమాటాల్లో పులుపు ఉంటుంది. అందులోనే నిమ్మరసం వేస్తే బాగుండదు. చల్లటి, వేడి పదార్థాలు వెంటనే తీసుకోకూడదు. పరస్పర విరుద్ధ గుణాలున్న వాటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండకుండా పోతుంది.
వేడి పదార్థాలు తినేటప్పుడు చల్లని నీరు తాగడం కూడా సురక్షితం కాదు. మన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా తింటే మనకు అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. అందుకే తిండి విషయంలో అన్ని సవ్యంగా ఉండేలా చూసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మునుముందు మనకే పెద్ద నష్టం కలుగుతుంది.






