
Ramcharan-Upasana daughter name : మెగా ప్రిన్సెస్ బుడిబుడి అడుగులు వేసుకుంటూ మెగా ఇంట్లోకి తన పాదం మోపింది. గత మంగళవారం (జూన్ 20) తెల్లవారు జామున 1.47 నిమిషాలకు పుట్టింది మెగా యువరాణి. ఆమెను చూసేందుకు చాలా మంది ప్రముఖులు అపోలో హాస్పిటల్స్ కు వచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే కొడుకు పుట్టలేదని కొంత నిరుత్సాహంగా ఉన్నా.. మెగా ఇంటి నుంచి ఎవ్వరచ్చినా మా ఆశీస్సులు ఉంటాయనే అంటూ పోస్టులు సైతం పెట్టారు. అయితే ఇప్పుడు చిరంజీవి మనుమరాలి పేరుపై మెగా ఫ్యామిలీ తర్జన భర్జన అవుతుంది.
మెగా కుటుంబానికి మొదటి వారసురాలు. ఇక బుడి బుడి అడుగులు వేసుకుంటూ సందడి చేస్తుందని చిరంజీవి-సురేఖ సంబురంలో ఉన్నారు. గతంలో రాం చరణ్-ఉపాసన సొంత ఇంటిలో కాకుండా బయట ప్రైవసీ కోసం ఉండేవారు. కానీ చిన్నారి పుట్టడంతో తన ఇంటికే వెళ్లాలని అనుకున్నారు. అందుకోసం చిరంజీవి తన ఇంట్లో ఏర్పాట్లు కూడా చేయించారు. చిన్నారికి, కోడలికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకొని మరీ దగ్గరుండి ఇంట్లోని కొన్ని ప్రదేశాలను శుభ్రం చేయించారు.
ఇవన్నీ పక్కనుంచితే చిరంజీవి తన మనుమరాలికి ఏం పేరు పెట్టనున్నారని సోసల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. దాని కోసం చిరంజీవి చిన్నారి జాతకాన్ని జ్యోతిష్యుల వద్దకు తీసుకెళ్తున్నారట. ఏ పేరైతే చిన్నారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆరా తీస్తున్నారట. రాశులు, గ్రహాలు కలిసేలా.. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదిగేలా మంచి పేరును సూచించాలని కోరుతున్నారట. ఇప్పటికే జ్యోతిష్యులు కూడా కొన్ని పేర్లను చిరంజీవికి చెప్పారట. అందులో తన ఆరాధ్య దైవం శ్రీ ఆంజనేయ స్వామి పేరుతో కలిసే పేరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారట.
తన కోడలు ఉపాసన గర్భవతి అని చెప్పిన సమయంలో మొదటి సారి చిరంజీవి హనుమంతుడినే ధ్యానించారు. ఆయనకే పూజలు చేశారు. హనుమంతుడు అంటే మెగాస్టార్ కు అంత ఇష్టం. ఈ ఇష్టంతోనే తన మనుమరాలి పేరును కూడా హనుమంతుడి పేరులోని ఏదైనా నామం వచ్చేలా పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మెగా ప్రిన్సెస్ పేరును బారసాల వరకు అంటే ఇంకా 20 రోజుల్లోపు అధికారికంగానే తెలుస్తుంది. ఏం పేరు పెడతారో వేచి చూడాలి మరి.