
Husband and wife : మన వైవాహిక జీవితంలో కలతలు వస్తుంటే వాస్తు దోషాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంసారంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే వాస్తు ప్రకారం ఇల్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కష్టాలే. ఇలా ఇంట్లో అన్ని పక్కా వాస్తు ప్రకారం ఉండాలని భావిస్తుంటారు. ఇంటికి పక్కా వాస్తు ఉండకపోతే ఆర్థిక ఇబ్బందులు కూడా వేధిస్తాయి.
ఇంట్లో ఫర్నిచర్ కూడా సక్రమంగా అమర్చుకోవాలి. పడక గది విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. గదిలో భారీగా ఫర్నిచర్ ఉంటే దాన్ని పశ్చిమం, దక్షిణం గోడ వైపు పెట్టాలి. ఫర్నిచర్ ను ఉత్తరం, తూర్పు వైపున పెడితే అరిష్టమే. ముదురు రంగు ఫర్నిచర్ కాకుండా లేత రంగులో ఉండే వాటిని తీసుకుంటే మంచిది.
భార్యాభర్తల బంధంలో మంచి ప్రభావాన్ని చూపించాలంటే వాస్తు ప్రకారం ఇంట్లో ఫర్నిచర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్నిచర్ ప్రతికూలతల నుంచి బయటపడాలంటే వాస్తు నియమాలు పక్కా పాటించాల్సిందే. పడక గదిలో ఫర్నిచర్ ను చెక్కతో తయారు చేసిందే ఉంచుకోవాలి.
రోజ్ వుడ్, గంధం, అశోక, టేకు, వేప, తుమ్మ తో చేసిన ఫర్నిచర్ ను మాత్రమే ఉపయోగించాలి. ఇతర కర్రలతో చేసిన వాటిని ఉంచుకోవడం మంచిది కాదు. పడక గదిలో తాజా పువ్వులు ఉంచుకుంటే గొడవలు లేకుండా ఉంటాయి. బెడ్ రూంలో పసుపు రంగు కొవ్వొత్తులతో దీపాలు వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు దూరమవుతాయి.