
Money on road : అప్పుడప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డుపై డబ్బులు కనిపిస్తాయి. దీంతో వాటిని తీసుకోవాలా? వద్దా? అనే సందేహాలు రావడం సహజమే. కొందరేమో మహాలక్ష్మి దొరికిందని చెబుతారు. కొందరేమో మనకు దారిద్ర్యం వస్తుందని అంటుంటారు. ఇందులో ఏది నిజమో తెలియదు. చాలా మంది మాత్రం తమకు దొరికిన డబ్బులు జేబులో వేసుకోవడం చేస్తుంటారు.
ఇలా రోడ్డు మీద దొరికినప్పుడు వాటిని మనం ఖర్చు చేయకూడదు. మన అవసరాలకు వినియోగించుకోకూడదు. ఎవరైనా పేద వారు ఉంటే వారికి దానం చేయడం మంచిది. వాటిని మనమే నేరుగా ఖర్చు చేస్తే వారి పాపం మనకు చుట్టుకుంటుంది. అదే ఎవరికైనా ఇస్తే పారేసుకున్న వారికి తీసుకున్న వారికి మధ్యలో మనం ఉంటాం కాబట్టి ఆ పాపం మనకు తగలదు.
పేదవారు ఎవరు కానరాకపోతే దేవుడి హుండీలో వేసినా ఆ పాపం మనకు అంటదు. ఇలా బజారులో దొరికిన డబ్బును మనం దగ్గర ఉంచుకోవద్దు. మనం ఏదైనా పని మీద పోతుంటే నాణెం దొరికితే శుభం జరుగుతుందని అంటారు. మనం ఏదైనా పని ముగించుకుని వస్తుంటే డబ్బులు కనిపిస్తే మంచిదని చెబుతారు. ఇలా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
రోడ్డు మీద డబ్బులు దొరికితే మన పూర్వీకులు మాత్రం మంచిదే అంటారు. మనం చేయాలనుకునే పని గట్టిగా ప్రయత్నిస్తే ఆ పనివిజయవంతం అవుతుందని నమ్ముతారు. ఇలా డబ్బుల విషయంలో నానా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దొరికిన డబ్బులను ఎలా వాడుకోవాలో తెలుసుకుని ప్రవర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయి.