
Mustache and Beard :యుక్త వయసులో మీసాలు, గడ్డం వస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు. నూనూగు మీసాలు, గడ్డం ఉండటం వల్ల మగాడి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొందరికి ఇలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో పేడు మూతి వాడు ఎప్పుడు పెళ్లికొడుకే అంటుంటారు. గడ్డం, మీసాలు వస్తేనే మగాడిలా ఉంటాడు. లేదంటే అటు ఇటు కాని వాడిలా ఉంటాడు. అందుకే మగాడికి గడ్డం, మీసాలే అందం.
మీసాలు, గడ్డం (mustache and beard) పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వెంట్రుకలు పెరగడానికి ముందుగా షేవింగ్ చేసుకోవాలి. స్టీమింగ్ చేసుకుని పదునుగా ఉండే బ్లేడ్ తో పాటు వేడి నీటి సహాయంతో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎలక్ర్టానిక్ ట్రిమ్మర్ కు బదులు రేజర్ వాడటమే మంచిది. కొందరు వెంట్రుకలు రావాలని రోజు సేవింగ్ చేస్తుంటారు. ఇది కరక్టు కాదు కేవలం అపోహ మాత్రమే.
ఇలా చేస్తే పాలికిల్ లు ఉద్దీపనలకు గురి కావడం వల్ల వెంట్రుకలు మితిమీరిపోయి వస్తే ఇబ్బందులు వస్తాయి. ఏదైనా క్రీములను రాసుకునేటప్పుడు గడ్డం ప్రాంతాన్ని లాగి రాసుకోవడం మంచిది. ఇలా చేస్తే మన రాసుకునే వాటి వల్ల ఇబ్బందులు రావు. ఇలా మీసాలు, గడ్డం రావాలంటే ఏది పడితే అది వాడకూడదు. జాగ్ర్తత్తగా ఆలోచించి వాడుకుంటే మంచి పలితం ఉంటుంది.
ఏదైనా క్రీమును ముఖానికి మర్దనా చేసి పాలికిల్ లు ఉద్దీపనలకు గురై వెంట్రుకలు పెరుగుతాయి. ఉసిరి లేదా యూకలిప్టస్నూనెతో రోజు పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే వెంట్రుకలు పెరిగే వీలుంటుంది. ఇంకా పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. క్యారెట్, ఆకుకూరలు, చికెన్, మటన్, చేపలు, ధాన్యాలు, బీన్స్, నట్స్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంది.