
Liver Healthy : మన శరీర అవయవాల్లో ప్రధానమైనది కాలేయం. ఇది కూడా గుండె తీరుగానే పనిచేస్తుంది. 24 గంటలు తన విధులు నిర్వహిస్తూనే ఉంటుంది. మనం తినే ఆహారాలను జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీర అవయవాల్లో కాలేయం పెద్దది. అవిశ్రాంత పోరాటంలో భాంగా కాలేయం ఎన్నో రకాల పనులు చేస్తుంది. మన దేహాన్ని క్రమబద్ధీకరించడంలో దీని పాత్ర ఎంతో ఉంటుంది.
కాలేయం పాడయితే అంతే సంగతి. మరణమే శరణ్యం. ఎందుకంటే కాలేయ మార్పిడి ఉండదు. తొలి దశలో లక్షణాలేవి కనిపించవు. జబ్బు ముదిరే కొద్దీ కామెర్లు వస్తాయి. కళ్లు పసుపు పచ్చగా మారుతాయి. మూత్రం ముదురు రంగులో వస్తుంది. కుడివైపు రొమ్ము కింద కొద్దిగా నొప్పి వస్తుంది. కాళ్లలో వాపులు వస్తాయి. రక్తం వాంతులు చేసుకునే అవకాశం ఉంటుంది.
మధుమేహం ఉన్న వారికి కాలేయ సమస్య రావొచ్చు. షుగర్ ఉన్న వారు ప్రతి రెండేళ్లకోసారి కాలేయ పరీక్ష చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలి. లేకపోతే కాలేయ సమస్య ముదిరితే ప్రాణాలు పోవడం గ్యారంటీ. ఈ నేపథ్యంలో కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది.
కాలేయం బాగుండాలంటే (Liver Healthy) మన ఆహార అలవాట్లు కూడా ముఖ్యమే. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వేపుళ్లకు దూరంగా ఉండాలి. నూనె పదార్థాలు మానుకోవాలి. మద్యం అలవాటు ఉంటే మంచిది కాదు. పొగతాగే అలవాటు కూడా మార్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలాంటి మంచి అలవాట్లు ఉంటే మన కాలేయానికి ఎలాంటి ఆపద ఉండదు.






