
dehydration Avoid : ఎండాకాలంలో అధికంగా చెమట పడుతుంది. చెమట రూపంలో లవణాలు వెళ్లిపోతాయి. దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో నీళ్లు కూడా ఎక్కువగా తాగుతుంటాం. నీళ్లు తక్కువగా తాగితే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కొందరు వేసవి కాలంలో మన నుంచి అన్ని బయటకు వెళతాయనే ఉద్దేశంతో ఎక్కువగా తీసుకోవాలని భావిస్తారు. ఇందులో ఉప్పు, చక్కెర అధిక మొత్తంలో తీసుకుంటారు. ఇది సరైంది కాదు. ఉప్పు, చక్కెర తీసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి.
ఉప్పు అధికంగా తీసుకుంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. కొందరు నిమ్మరసంలో ఉప్పు, చక్కెర వేసుకుని తాగుతుంటారు. ఇలాగైతే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో అనారోగ్యమే. ఈ నేపథ్యంలో నీరసం కలుగుతుంది. ఎండాకాలంలో చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యమే కానీ ఆరోగ్యం మాత్రం ఉండదు.
సహజసిద్ధమైన కొబ్బరినీళ్లు తాగితే శరీరానికి రక్షణ ఉంటుంది. అందులో తేనె కలుపుకుని తాగడం వల్ల శక్తి కలుగుతుంది. చెరుకురసం తాగితే కూడా ఇంకా మంచిది. వైట్ పాయిజన్ తో సమానమైన ఉప్పు, చక్కెరలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. వేసవికాలంలో శరీరం డీ హైడ్రేడ్ కు గురి కాకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగాలి. దీని వల్ల మనకు ఎంతో ప్రయోజనం.
అంతే కాని ఇతర వాటిని తీసుకోవడం వల్ల నష్టాలే వస్తాయి. భోజనం చేశాక రెండు గంటల తరువాత నుంచి ప్రతి అర గంటకోసారి ఓ గ్లాసు నీరు తాగితే బాడీ డీ హైడ్రేషన్ కు గురి కాదు. ఇంకా అప్పుడప్పుడు మజ్జిగ తీసుకుంటే ఇంకా మంచిది. ఇలా వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర పదార్థాలేవీ తీసుకోకుండా ఉంటేనే మంచిది.






