
sun stroke : ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. మేలో ఎండలు మెండు అంటారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు దాటే వరకు బయటకు వెళితే వడదెబ్బ సోకే అవకాశం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంతటి ఎండలో బయటకు వెళితే జాగ్రత్తలు పాటించాలి.
నెత్తికి టోపీ ధరించాలి. ముఖానికి రుమాలు కట్టుకోవాలి. చేతులకు కూడా రక్షణ ఉండాలి. తెల్లటి దుస్తులు ధరించాలి. అవి కూడా వదులుగా ఉండాలి. టైట్ గా ఉంటే ఉబ్బరపోస్తుంది. చెమట వస్తే శరీరం తొందరగా అలసిపోతుంది. దీని వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శరీరం డీ హైడ్రేషన్ కు గురయితే వడదెబ్బ సోకే అవకాశముంటుంది. అందుకే జాత్రత్తలు తీసుకోవాలి.
బయటకు వెళితే నీళ్ల బాటిల్ వెంట ఉంచుకోవాలి. అందులో కాస్తంత నిమ్మరసం కలుపుకుంటే ఇంకా ప్రయోజనం కలుగుతుంది. ఎండదెబ్బ రాకుండా నిరోధిస్తుంది. ఇంట్లో ఉన్న గంటకోసారి నీళ్లు తాగుతుండాలి. లేకపోతే శరీరంలో నీటి శాతం తగ్గితే ముప్పు ఏర్పడుతుంది. వడదెబ్బ అటాక్ చేస్తుంది. దీంతో ఎండ బారి నుంచి రక్షించుకునేందుకు నానా రకాల చర్యలు తీసుకుంటేనే సరి.
ఎండలో కష్టపడే వారికి నీళ్లు చాలా అవసరం. వారు నీళ్లు తాగుతూనే ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే. రోజుకు కనీసం 5-6 లీటర్ల నీటిని తాగాలి. అది కూడా చల్లని నీరు కాదు. ఫ్రిజ్ వాటర్ అసలే తాగకూడదు. మట్టికుండలో నీళ్లయితే మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మనకు వడదెబ్బ సోకే అవకాశం ఉండదు. అంతేకాని నిర్లక్ష్యంగా ఉంటే మన ప్రాణాలకే ప్రమాదం సుమ.