Food Items Eating : మనం ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం సహజమే. అయితే ఇది ఏ రూపంలో తీసుకోవాలో తెలియదు. చాలా మంది ఉదయం టీలో బ్రెడ్ వేసుకుని తింటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. ఏదో ఆకలేస్తోందని ఏది పడితే అది తింటే కడుపు కీకారణ్యంగా మారుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తినడమే మంచిది. కీడు చేసే వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతుంటారు. ఖాళీ కడుపుతో అవి తాగడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. ఉదయం పూట టిఫిన్ చేయకుండా టీలో బ్రెడ్ వేసుకుని తింటుంటారు. దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా టీ, కాఫీలు తాగడం సురక్షితం కాదు. అందుకే ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాతే ఏదైనా తాగడం ఉత్తమం.
ఇటీవల కాలంలో చాలా మంది చిరుధాన్యాలు తీసుకుంటున్నారు. కానీ ఇవి ప్రాసెస్ చేయకుండా ఉంటే సరి. లేకపోతే ప్రాసెస్ చేసినవి అయితే కూడా మన ఆరోగ్యానికి ప్రమాదమే. చిరుధాన్యాలు పాలిష్ పట్టనివి తీసుకొచ్చుకుని వాటిని మనమే పట్టించుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా ధాన్యాలు తినడం వల్ల మంచి లాభాలే ఉంటాయి. కానీ ప్రాసెస్ చేసిన వాటిని తీసుకోవడం మనకు నష్టమే.
కొందరు పనుల హడావిడిలో పడి అల్పాహారమే మానేస్తుంటారు. దీని వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. ఉదయం పూట 8.30 గంటల లోపు ఏదో ఒక టిఫిన్ కడుపులో పడకపోతే గ్యాస్ సమస్యలొస్తాయి. అందుకే ఉదయం టిఫిన్ చేసిన తరువాత కాఫీ, టీలు తాగడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు రావని తెలుసుకోవాలి.