
India vs Canada : గతేడాది జూన్‌లో వాంకోవర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది, కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి భారత ఏజెంట్లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై కెనడా దర్యాప్తునకు సహకరించాలని అమెరికా భారత్‌ను కోరింది. మంగళవారం (అక్టోబర్ 15) వాషింగ్టన్, DCలో జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ, ‘కెనడా ఆరోపణలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’ అని యూఎస్ స్పష్టం చేసినట్లు చెప్పారు. బిడెన్-హారిస్ కెనడాకు పూర్తి మద్దతు ఉంటుంది. ఈ హత్యకు సంబంధించి కెనెడాకు అమెరికా సహకరించేలా కనిపిస్తుంది. అయితే, నిజ్జార్ హత్య సమయంలో కూడా కెనెడా ఆరోపణల నేపథ్యంలో భారత్ సాక్షాలను అడిగింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతన్ని చంపినట్లు అందుకే భారత ప్రభుత్వ ఏజెంట్లు సహకరించారని కెనెడా ఆరోపిస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి ఆధారాలను మాత్రం కెనెడా చూపడం లేదు. ఆయన హత్యకు భారత్ కు సంబంధం లేదని ఢిల్లీ పదేపదే చెప్తోంది. ఇప్పుడు యూఎస్ తో ప్రెషల్ పెట్టించినంత మాత్రాన కెనెడా ఏదో కలిసి వస్తుందని అనుకోవడం వృథానే అవుతుంది.