- చదువుల కోసం వలస బాట పడుతున్న విద్యార్థులు
- భవిష్యత్ కోసం యువకులదీ అదే దారి..

Neighbor State : అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రానురాను వలసాంధ్రగా మారుతున్నది. ఏ పనైనా పక్క రాష్ర్టాల వైపు చూస్తున్నది. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే ఏపీ విద్యార్థుల ఫస్ట్ ఆప్షన్ పక్క రాష్ర్టాలే. ఇంటర్ నుంచే విద్యార్థులు ఇంటిని వీడి పొరుగు రాష్ర్టాలకు పయనమవుతున్నారు. ఇక్కడి చదువుకంటే ఇతర రాష్ర్టాల్లో హాస్టళ్లలో తమ పిల్లలను ఉంచేందుకు వెనకాడడం లేదు. ఇంజీనిరింగ్ లో ఏపీ విద్యార్థులే ముందుంటున్నారు.
తెలంగాణలో ఎంసెట్తో ర్యాంకులన్నీ ఏపీ వాళ్లకే వచ్చాయి. ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదంటూ అక్కడి యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కి సమీప ప్రాంతాల ఆయా నగరాలకు వెళ్లి చదువుకుంటున్నారు. చదువు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. నిరుపేదలు మాత్రమే ఏదో ఒక పని చేసుకుంటూ ఏపీకే పరిమితమవుతున్నారు. వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు అంతంతే. ఇక ఉపాధి అవకాశాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచింది.
గత నాలుగేళ్లలో ఒక్క కంపెనీ కూడా ఏపీ కి రాలేదు. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నాయి. దీంతో ఉన్న ఉపాధి అవకాశాలు పోతుండగా, ఉద్యోగాలు కోల్పోతున్న వారు కూడా ఎక్కువే. ముందుకుగా అనుకున్న రాష్ర్ట రాజధాని అమరావతి కూడా ఆగిపోయింది. దీంతో అక్కడ పని చేసే 50 వేల మంది పొరుగు రాష్ట్రాల బాట పట్టారు. ఇక కొత్తగా చదువులు పూర్తయ్యే వారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోనే తమ భవిష్యత్ ను వెతుక్కుంటున్నారు.
షాపింగ్ కూ..
చదువులు.. ఉద్యోగాల కోసమే కాదు చివరికు షాపింగ్ చేయాలన్న ఈ నగరాలకే వెళ్లాల్సి వస్తున్నదని ఏపీ ప్రజలు చెబుతున్నారు. ఏపీలో ప్రోత్సాహకాలు లేకపోవడంతో అన్ని వ్యాపారాలు డీలా పడుతున్నాయి. రేట్లు కూడా ఎక్కువే. అమ్మకాలూ తగ్గిపోతున్నాయి. దీంతో ఏపీలో షాపింగ్ చేయడానికి జనం ఇంట్రెస్ట్ చూపడం లేదు. హైదరాబాద్‌లో రూ. వందకు వచ్చే వస్తువు ఏదైనా ఏపీలో రూ.150 దాకా వెచ్చించాల్సి వస్తున్నది. ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా, మరో ఇతర కార్యక్రమమైనా సమీపంలోని మెట్రో నగరాలకు వెళ్లి షాపింగ్ చేస్తున్నారు. కానీ.. ఏపీలో బేరం చేయాలనే ఆలోచనలే లేవంటున్నారు. ఇప్పటికే సంపాదన లేదని, మరింత ఎందుకు నష్టపోవాలని.. కాస్త దూరమైన వెళ్లి షాపింగ్ చేసుకొని డబ్బులు ఆదా చేసుకుంటున్నారు.
మద్యానికి పొరుగు రాష్ట్రానికే..
సాయంత్రం పూట కాస్త చిల్ అవుదామనుకుంటే మద్యం తాగడానికీ వలస బాటపట్టడం మరీ దారుణం. రోజువారీ కూలీలు పొద్దంటా పని చేసి అలసిపోతారు. ఆ అలసిన శరీరాలకు కాస్తంతా మద్యం తప్పనిసరి. కానీ ఇక్కడ ప్రభుత్వ బ్రాండ్లనే తాగాలి. మరో బ్రాండ్ ఉండదు. కానీ అవి కూడా తాగలేని పరిస్థితి. ఇంకొందరు వారాంతాల్లో పొరుగు రాష్ట్రాలకు టూర్లు వేస్తున్నారు . సరిహద్దులకు ఇంకా దగ్గరగా ఉంటే..నిత్యం వెళ్లివస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని తెలంగాణ వైన్స్ షాపుల్లో మద్యం అమ్మకాలు హైదరాబాద్ ని సేల్స్ ని మించుతున్నాయి. ఇదీ వలసాంధ్ర పరిస్థతి.