
Marriage life Wrong Steps : భార్యాభర్తల బంధంలో ఇద్దరు కావడి లాంటి వారు. కష్ట సుఖాల్లో కలిసి నడిచే అవకాశం వారికి ఉంటుంది. దంపతుల మధ్య అనురాగం, అన్యోన్యత, ఆప్యాయత ఎంతో ఉంటుంది. కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందంటారు. ఆలుమగల మధ్య ప్రేమానురాగాలు బలపడాలి. అప్పుడే వారి సంసారం కలకాలం నిలుస్తుంది. సంసారంలో కలతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఏ పనులు వారిని విడదీస్తాయనే వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. అవేంటో తెలుసుకోవాలి.
ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఉండాలి. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకోవాలి. అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. విభేదాలు లేకుండా జాగ్రత్త పడాలి. దంపతుల మధ్య నమ్మకం ఉండాలి. అది పోయిన నాడు సంసారం నిలబడదు. విశ్వసనీయత ముఖ్యం. లేకపోతే బలమైన బంధం కొనసాగదు. ఆరోగ్యకరమైన బంధం కొనసాగాలంటే ఇద్దరు పరస్పర అభిప్రాయాలు కలుపుకోవాలి.
లక్ష్యాలు ఎంపిక చేసుకోవడంలో కూడా ఇద్దరికి అవగాహన ఉండాలి. ఇద్దరి లక్ష్యాలు ఇద్దరికి నచ్చేలా ఉంచుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. లక్ష్య సాధనలో ఇద్దరు సమన్వయంతో ఉండాలి. అప్పుడే గొడవలకు ఆస్కారం ఉండదు. దంపతుల మధ్య కెరీర్ పరంగా కూడా మంచి ఉద్దేశాలు ఉంటే కలతలు రాకుండా ఉంటాయి.
సంసారంలో కలతలు రాకుండా ఉండాలంటే ఆర్థిక సమస్యలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒత్తిడి, టెన్షన్ లేకుండా చూసుకుంటే సరి. డబ్బు అవసరాలకు అనుగుణంగా లేకపోతే సంసారం నడవదు. దీంతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యంతో ఉంటే మనకు కష్టాలు తప్పవు. ఇద్దరి మధ్య ఏ రకమైన గొడవలు లేకుండా చూసుకుంటే ఇబ్బందులు ఉండవు.






