
WhatsApp Tips : దేశంలో మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. మనకు తెలియకుండానే మన ఖాతాలో డబ్బులు చోరీ చేస్తున్నారు. దీంతో మనం లబోదిబోమనడం తప్ప చేయగలిగిందేమీ లేదు. అందుకే అప్రమత్తంగా ఉండాలి.
అపరిచిత వ్యక్తులకు మన వివరాలు వెల్లడించరాదు. ఎవరైనా ఫోన్ చేసి మీ బ్యాంకు డిటేల్స్ చెప్పాలని కోరినా చెప్పొద్దు. బ్యాంకు వారెవరు కూడా మన వివరాలు ఫోన్ లో తీసుకోరు. అవసరమైతే బ్యాంకుకు రమ్మని చెబుతారు. అంతేకాని ఫోన్ లో వివరాలు ఇస్తే అంతే సంగతి. మన ఖాతాలో డబ్బు గోవిందా అవుతుంది. తరువాత తల పట్టుకోవాల్సిందే మరి.
ప్రజలను మోసం చేస్తున్న స్కామర్లు వాట్సాప్ ను లక్ష్యంగా చేసుకున్నారు. బ్యాంకింగ్ వివరాలు తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారు. తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు. వ్యక్తిగత సమాచారం ఎవరికి ఇస్తున్నామో గుర్తు పెట్టుకోవాలి. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దు. స్కామర్ల నంబర్లు బ్లాక్ చేసి వాట్సాప్ కు రిపోర్ట్ చేయాలి.
ఇలా మోసాలను ఆదిలోనే అడ్డుకోవాలి. లేదంటే మనకు జరగాల్సిన నష్టం జరిగితే డబ్బు మాయం అవుతుంది. ఫలితంగా వేదనకు గురవుతాం. కష్టపడి సంపాదించిన డబ్బు పోతే మనసుకు బాధ కలుగుతుంది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. డబ్బు విషయంలో అజాగ్రత్త పనికి రాదు. వీలైనంత వరకు మన వివరాలు ఎవరితో పంచుకోకపోవడమే బెటర్.