MS Dhoni : మహేంధ్ర సింగ్ ధోని అంటే మిస్టర్ కూల్. ఎంత ఒత్తిడి ఉన్న సరే తాను ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థులను చిత్తు చేసే ప్లాన్స్ వేస్తూ టీంలోని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ధోని ఆధ్వర్యంలో టీం ఇండియా 2007 టీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
టెస్టు టీం కూడా దాదాపు నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అయిదు సార్లు టైటిల్ అందించిన ఘనత ధోని సొంతం. ధోని కెప్టెన్సీలో ఆడేందుకు సురేశ్ రైనా లాంటి ఆటగాళ్లు ఎంతో ఇష్టపడేవారు. కాగా ధోని గురించి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ సంచలన విషయం వెల్లడించారు.
ధోని కూడా సాధారణ మనిషే. ఆయనకు కూడా చాలా కోపం వస్తుంది. దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. దీంతో ధోని కళ్లలోకి కూడా చూడలేదు. అంతలా భయమేసిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీతో మ్యాచ్ లో 110 పరుగుల రన్స్ టార్గెట్ ఉన్న సమయంలో చెన్నై బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్ బాట పట్టారు. అనిల్ కుంబ్లే బౌలింగ్ లో నేను కూడా ఒక షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాను.
దీంతో పెవిలియన్ కు వెళ్లే సమయంలో ధోని బ్యాటింగ్ వస్తుండగా.. డ్రెస్సింగ్ రూం సమీపంలో కింద ఉన్న వాటర్ బాటిల్ ను ధోని గట్టిగా తన్నాడు. దీంతో ఆయన కోపం చూసి నేను అక్కడి నుంచి తల దించుకుని వెళ్లిపోయాను. కనీసం దోని కళ్లలోకి చూసే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పాడు. దీంతో దోనికి కూడా కోపం వస్తుందని, అతడు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాడని బద్రీనాథ్ చెప్పిన విషయంతో అందరికీ అర్థమైపోయింది.