Pawan Kalyan Varahi Yatara : ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదటి విడుత శుక్రవారం ముగిసింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పెద్ద ఎత్తున ప్రజానీకం పవన్ యాత్రకు బ్రహ్మరథం పట్టింది. అధికార వైసీపీకి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పవన్ యాత్ర ఆద్యంతం కొనసాగింది.
అయితే మొదటి విడుత యాత్ర ముగియడంతో మరి రెండో విడుత యాత్ర ఎప్పుడు అన్నది ఇప్పుడు చర్చ సాగుతున్నది. మొదటి విడత యాత్ర అన్నవరంలో ప్రారంభమై భీమవరంలో ముగిసింది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నాయకుల తీరుపై పవన్ ప్రసంగం కొనసాగింది
అయితే టీడీపీ, బీజేపీలతో పొత్తు అంశం గురించి పవన్ ఎక్కడా మాట్లాడలేదు. తనను జనసేనను ఈసారి గెలిపించాలని ప్రజలను మాత్రం పవన్ కోరారు. గతంలో పవన్ ప్రసంగం అంటేనే ఆవేశపూరితంగా ఉండేది. కానీ ఈసారి పవన్ ప్రసంగ శైలిలో చాలా మార్పు కనిపించింది. వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పవన్ ప్రసంగం కొనసాగినా తీవ్ర విమర్శలు చేయడంలో కొంత వెనకడుగు కనిపించింది. అలాగే జనసేన ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో పవన్ ప్రసంగంలో తెలియజేశారు.
దాదాపు నెలరోజుల పాటు కొనసాగిన పవన్ వారాహి యాత్ర మొదటి విడత విజయవంతమైందని ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేళ్తున్నాయి. ఇక రెండో దశ పూర్ షెడ్యూల్ ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. గోదావరి జిల్లాలో పర్యటించని ప్రాంతాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించేలా రెండో విడుత టూర్ ఉంటుందని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ఈ మేరకు టూర్ ప్లాన్ రెడీ చేసేందుకు జనసేన అగ్రనేతలు సిద్ధమవుతున్నారు మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
అయితే జనసేనాని టూర్ శ్రేణుల్లో జోష్ మరింత పెంచింది. ఈసారి వైసీపీని బలంగా ఢీకొట్టాలని ఇప్పటికే పవన్ అందరికీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వమని ప్రకటిస్తూనే ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల తీరు, జనసేన అభిమానుల్ని ఇబ్బంది పెట్టిన తీరును చెబుతూ పవన్ ప్రసంగాలు కొనసాగాయి. ఈసారి విజయం తథ్యమని, గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కనివ్వొద్దని ఆయన పిలుపునిచ్చారు. జనసేనాని స్పీచ్ ఈసారి శ్రేణలు మంచి ఉత్సాహానిచ్చింది. ఇక రెండో దశ టూర్ కోసం జన సేన శ్రేణులు కూడా సిద్ధమవుతున్నాయి.
ReplyForward
|