kalki avatar హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు ప్రతీ యుగంలో ధర్మం తప్పినప్పుడు వారిని సంహరించి ధర్మాన్ని రక్షించడానికి వివిధ అవతారాలు ఎత్తారు.. ఇప్పటికే శ్రీమహా విష్ణువు 9 అవతారాలు ఎత్తారు.. కృతయుగం నుండి ఇప్పటి వరకు ఎన్నో అవతారాలు మార్చిన శ్రీమహా విష్ణువు కృష్ణుడు అవతారం తర్వాత ఈ కాళీ యుగంలో కల్కి అవతారం ఎత్తుతారని పురాణాల ప్రకారం కథనాలు ఉన్నారు.
ఈ కలియుగంలో ఈయన కల్కి అవతారం ఎత్తి పాపులను శిక్షించి యుగానికి నాంది పలుకుతారని పురాణాలు చెబుతున్నాయి.. శ్రీమహా విష్ణువు దశావతారాల్లో కల్కి అవతారం ఒకటి.. మరి ఈ కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? వస్తే ప్రపంచంలో ఏం జరుగుతుంది? అనే విషయాలను వ్యాస భగవానుడు చెప్పాడు.
కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది అంటే.. గోవులను వధించి, గో మాంసం తినడం ఎప్పుడైతే మొదలు అవుతుందో, అలాగే వివాహ వ్యవస్థ కుప్పకూలి పోతుందో.. యజ్ఞయాగాలు కనిపించకుండా ఉంటాయో.. భార్య భర్తలను ఒకరిని ఒకరు ఎప్పుడు గౌరవించుకోవడం మానేస్తారో అప్పుడు కల్కి అవతారం మొదలు అవుతుందట.
అలాగే పురుషులు 18 ఏళ్లకే మరణిస్తారో అప్పుడు శంభాలా అనే గ్రామంలో విష్ణుయేశుడు అనే బ్రాహ్మణుని కడుపున కల్కి అనే పేరుతో మహావిష్ణువు 10వ అవతారంగా జన్మిస్తాడు. అప్పుడు కలియుగం అంతం అవడానికి కృతయుగం మొదలవడానికి మధ్యలో ఆయన జన్మిస్తాడు అని తెలిపాడు. కల్కి అవతారంగా మహా విష్ణువు జన్మించాడు అనేందుకు గుర్తుగా పాపులు భంగధర అనే జబ్బుతో పురుగులు రాలినట్టు రాలిపోతారు.
పుణ్యాత్ములు ఎవరు ఉంటారో వారు మాత్రమే తమ శరీరాలతో ఉంటారని కృత యుగం మొదలవడానికి ముందు జలప్రళయం వచ్చి నీటితో ముంచేస్తుంది అని తెలిపారు. మరి కల్కి అవతారం గురించి విన్న తలచుకున్న పాప బుద్ధి తగ్గిపోతుందని.. అంతటి గొప్ప అవతారం కల్కి అని పండితులు సైతం చెబుతున్నారు.