బర్త్ డే పార్టీ ఎక్కడ వెంకీ ? అంటూ ప్రశ్నిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు దాంతో వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు సోషల్ మీడియాలో. ఇక పనిలో పనిగా బర్త్ డే పార్టీ ఎక్కడ అంటూ ప్రశ్నించాడు చిరు. సాధారణంగా పలువురు సినీ ప్రముఖులు తమ పుట్టినరోజు వేడుకలను ముందు రోజు రాత్రి జరుపుకుంటారు. అలాగే పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తారు.
అలాగే పుట్టినరోజున కూడా రాత్రి పార్టీ ఇస్తారు. అయితే వెంకీ మామ అయితే డిసెంబర్ 12 న పార్టీ ఇవ్వలేదు …… మరి ఈరోజు ఇస్తాడేమో. అందుకే కాబోలు పార్టీ ఎక్కడ అంటూ అడిగాడు చిరు. 90 వ దశకంలో తెలుగునాట నలుగురు స్టార్ హీరోలు ఓ వెలుగు వెలుగుగా అందులో మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ ప్రముఖులు.
ఇక వెంకటేష్ హీరోగా కెరీర్ తొలినాళ్ళలో నటించిన చిత్రం ” త్రిమూర్తులు ”. ఆ సినిమాలో అప్పటి సీనియర్ హీరోలు కృష్ణ , శోభన్ బాబు , కృష్ణంరాజు లతో పాటుగా చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున లు ఒక పాటలో కనిపిస్తారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. స్టార్ హీరోలతో పాటుగా పలువురు స్టార్ హీరోయిన్ లు కూడా ఆ పాటలో కనిపిస్తారు.
ఇక వెంకీ మామ విషయానికి వస్తే ……. విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు వెంకీ. దృశ్యం 2 , నారప్ప చిత్రాలతో సంచలనం సృష్టించాడు. ఈ రెండు కూడా నేరుగా ఓటీటీ లో విడుదల అయ్యాయి. ఓటీటీలో కూడా సంచలన విజయం సాధించాయి. ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో రానాతో కలిసి నటిస్తున్నాడు వెంకీ.
మై డియర్ వెంకీ… @VenkyMama
Happy Birthday 💐🎂
Where is the Party?!! pic.twitter.com/kRHhEErsLD
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2022