Election Ink : ఎన్నికల్లో ఓటు వేశాక మన ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. దొంగ ఓట్లు వేయకుండా చేసేందుకు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఈ పద్ధతి 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదలు పెట్టారు. ఈ గుర్తు పెడితే రెండు మూడు రోజులు పోకుండా ఉంటుంది. దీంతో ఒకసారి ఓటు వేస్తే మళ్లీ వేయడం వీలు కాదు. అందుకే ఈ పద్ధతిని దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.
సిరాను మైసూర్ లోని సిరా మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ పరిశ్రమలో తయారు చేస్తారు. ఈ పరిశ్రమను మైసూర్ మహారాజు క్రిష్ణరాజ వడయార్ -4 1937లో స్థాపించారు. ఇక్కడ తయారయ్యే ఇంకునే దేశవ్యాప్తంగా ఉపయోగిస్తు్నారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండటం వల్ల ఇంకు గుర్తు మూడు నాలుగు రోజుల వరకు అలాగే ఉంటుంది.
సిరా గుర్తు ఎడమ చేతి చూపుడు వేలిపై పెడతారు. 37(1) నిబంధన ప్రకారం ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపైనే ఇంకు గుర్తు పెట్టాలని నిర్ణయించారు. ఇంకా 29 దేశాల్లో జరిగే ఎన్నికలకు కూడా ఈ ఇంకునే ఎగుమతి చేస్తారు. మైసూరుతో పాటు హైదరాబాద్ లోని రాయుడు ల్యాబరేటరీలో కూడా ఈ సిరా తయారు చేస్తారని చాలా మందికి తెలియదు.
ఈ ఇంకును స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు వేసే పోలియో చుక్కలు వేసే సమయంలో కూడా గుర్తు పట్టేందుకు ఉపయోగిస్తుంటారు. హైదరాబాద్ లో తయారయ్యే సిరా ప్రపంచ దేశాలకు ఎగుమతి కావడం గమనార్హం. తెలంగాణలో ఎన్నికల కోసం రెండు లక్షల సిరా బాటిళ్లు సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇలా సిరా చుక్కకు ఇంతటి చరిత్ర ఉందని గుర్తుంచుకోవాలి.