
Chitralekhala Temple : మనదేశంలో దేవాలయాలకు కొదవలేదు. అన్ని దేవుళ్లకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. కానీ కుబేరుడికి సంబంధించిన ఆలయాలు ఉండటం అరుదు. కుబేరుడు యక్షులకు నాయకుడు కుబేరుడిని పూజిస్తే సిరులు కలుగుతాయి. కుబేరుడిని లక్ష్మీనారాయణుడితో పూజిస్తారు. కుబేరుడిని పూజిస్తే ధనప్రాప్తి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతుంటారు. కుబేరుడు ఆయన భార్య చిత్రలేఖకు కలిపి ఉన్న ఆలయాలు అరుదుగా ఉంటాయి.
తమిళనాడులోని చెన్నై నుంచి చెంగల్ పట్టు వెళ్లే దారిలో రత్న మంగళం అనే ఊరిలో కుబేరుడు లక్ష్మీదేవి ఆలయం ఉండటం గమనార్హం. కుబేరుడి ఆలయం భవిష్య పురాణం ప్రకారం పులస్త్యుడి కొడుకు విశ్వావను. ఇళల వైశ్రవణుడు. ఆయనే కుబేరుడు విశ్వావసు, కైకసిల కుమారుడు రావణుడు. కుబేరుడు లంకకు మహారాజు. కానీ రావణాసురుడు తన రాక్షస బలంతో కుబేరుడిని అధికారం నుంచి దూరం చేస్తాడు.
కుబేరుడు తన తండ్రి సలహాతో లక్ష్మీనారాయణుల విగ్రహాలు ప్రతిష్టించి వ్రతం చేస్తాడు. ఆ రోజు అక్షయ త్రుతీయ రోజు లక్ష్మీదేవిని కొలవంతో నువ్వు ధనాధిపతివి అవుతావని దీవిస్తుంది. అలా కుబేరుడు సంపదలకు కేంద్రంగా నిలుస్తాడు. కుబేరుడి ప్రతిమకు పూజించి బ్రాహ్మణుడికి దానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్ముతారు.
ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే ఎడమ వైపు షోడశ గణపతులు ఉంటారు. నవగ్రహాలు భార్యలతో పాటు కొలువు దీరారు. గర్భాలయంలో కుబేరుడు, అతని భార్య చిత్రలేఖల విగ్రహాలు ఉన్నాయి. ఒక నాణానికి ఎర్ర దారం కట్టి రూ.30 కి అమ్ముతారు. లాఫింగ్ బుద్ధ ఎడమ చేతిలో పెట్టి, తరువాత ఆయన బొజ్జ మీద తాకించి పర్సులో పెట్టుకుంటే లక్ కలిసొస్తుంది.