Pawan Kalyan : తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ ఎవరికి రాదు. ఇతర భాషల నటులు కూడా అంతే. పవన్ కల్యాణ్ అంటే భయపడాల్సిందే. అతడి టైమింగ్ , కామెడీ అలా ఉంటుంది. అందుకే ఇతర భాషల వారు పవన్ సినిమాలు రీమేక్ చేయాలంటే జంకుతుంటారు. అతడి బాడీ లాంగ్వేజ్ మా వల్ల కాదని చేతులెత్తేస్తారు. ఆ స్టైల్ ఆయనకే సొంతం. చేస్తే ఆయనే చేయాలి. లేదంటే లేదు. అంతేకాని పవన్ కల్యాణ్ సినిమాలను రీమేక్ చేసే దమ్ము లేదని చెబుతుంటారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా జల్సా ఆమధ్యన మంచి హిట్ అందుకుంది. దాన్ని తమిళంలో రీమేక్ చేయాలని ప్రముఖ నటుడు విజయ్ కు చెప్పారట. అతడు ఈ సినిమా చూసి వామ్మో నావల్ల కాదని చెప్పాడట. పవన్ కల్యాణ్ నటన తనకు రాదని దండం పెట్టేశాడట. దటీజ్ పవన్ కల్యాణ్. అందుకే ఆయన తెలుగు వారికి ఆరాధ్యుడయ్యాడు.
ఆ మధ్యన ఓ సినిమాలో పవన్ కల్యాణ్ పాట తీసుకుని విజయ్ నయన తారల మీద చిత్రీకరించారట. దానికి పవన్ ఫ్యాన్స్ విజయ్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారట. బాగా చేయకపోయినా ఫర్వాలేదు. కానీ పాట పరువు తీశాడని తిట్టారట. దీంతో పవన్ కల్యాణ్ సినిమా అంటే అందరు భయపడుతున్నారు. పవన్ కల్యాణ్ సినిమా ఒకటి రీమేక్ చేయాలని ప్రయత్నం చేసినా తన వల్ల కాదు బాబోయ్ అని విజయ్ కూడా చెబుతున్నాడు.
ఇలా పవన్ కల్యాణ్ సినిమాలంటే అందరికి భయమే. విజయ్ మాత్రం పవన్ కల్యాణ్ సినిమా అంటేనే ఏదో తెలియని భయంలో ఉంటున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ సినిమాలంటే మామూలుగా ఉండవు. అందులో ఉండే విలువలు ఎవరికి ఒంట పట్టవు. అందుకే అతడి సినిమాలను రీమేక్ చేయడం అంటే మాటలు కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి.
ReplyForward
|