
Control sugar : మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. డయాబెటిస్ ఎన్నో సమస్యలకు నిలయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో షుగర్ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. చక్కెరను కంట్రోల్ లో ఉంచుకోవాలి. లేకపోతే ఇతర సమస్యలు వస్తుంటాయి. శరీర అవయవాలు దెబ్బతినడానికి షుగరే ప్రధాన కారణంగా నిలుస్తోంది. షుగర్ ను నియంత్రణలో ఉంచే జ్యూస్ లు ఏంటో తెలుసా.
షుగర్ ను కంట్రోల్ ఉంచే వాటిలో చేదు వాటికి ఎంతో విలువ ఉంటుంది. వేపాకు జ్యూస్ తాగితే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. లివర్ ను డీటాక్స్ చేయడంలో సాయపడతుంది. ఇంకా కాకరకాయ జ్యూస్ కూడా మంచిదే. ఇది కూడా చేదుగా ఉండటంతో దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ తగ్గేందుకు దోహదపడుతుంది.
క్యాబేజీ జ్యూస్ కూడా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ గ్లూకోజ్ ను అదుపులో ఉంచుతుంది. ఉసిరి జ్యూస్ కూడా షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్ ను పెంచుతుంది. పాలకూర జ్యూస్ వల్ల కూడా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇలా ఈ జ్యూస్ లు తాగుతూ ఉంటే షుగర్ తక్కువ అవుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. చక్కెరను కంట్రోల్ లో ఉంచడానికి ఇవి సాయపడతాయి. అందుకే రోజు చక్కెరను తగ్గించేందుకు వీటితో చేసిన జ్యూస్ లు తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇలా మనకు అనేక రకాల ప్రయోజనాలు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.






