
Bellam konda Srinivas :బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తెలుగులో మంచి గుర్తింపు పొందిన నటులలో ఈయన ఒకరు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. తెలుగు సినీ ప్రేమికులకు తన నటనతో, డ్యాన్స్ తో బాగా దగ్గర అయ్యాడు.. అల్లుడు శ్రీను సినిమాతో ఈయన వెండితెరకు పరిచయం అయ్యాడు..
మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ అందుకుని తెలుగు ప్రేక్షకులు గుర్తింప దగ్గ హీరోగా రాణిస్తున్నాడు.. ఇక బెల్లంకొండ ఆఖరుగా అల్లుడు అదుర్స్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలతో వచ్చిన హిట్ అందుకోలేక పోయాడు.. ఇక ఇప్పుడు తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..
తెలుగులో రాజమౌళి చేసిన బ్లాక్ బస్టర్ సినిమాను హిందీలో రీమేక్ చేసారు. ఈ రీమేక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా.. వివి వినాయక్ డైరెక్ట్ చేసాడు.. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.. ఈ ఇంటర్వ్యూలలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు..
”నా తండ్రి ఒక నిర్మాత కావడం వల్లే నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి అని అనుకుంటారు.. అది నిజమే.. కానీ నా కష్టం, హార్డ్ వర్క్ కూడా ఉండడం వల్ల ఇప్పటి వరకు నేను ఇండస్ట్రీలో ఉన్నాను.. లేకపోతే ఉండే వాడిని కాదు అని తెలిపాడు.. అల్లుడు శ్రీను హిట్ అయిన తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.. కానీ అప్పట్లో మేము ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాము..
మా నాన్న డిస్టిబ్యూట్ చేసిన 8 సినిమాలు వరుసగా నష్టాలను చవిచూశాయి.. అదే సమయంలో నా నెక్స్ట్ సినిమాను తక్కువ బడ్జెట్ తో చేశాను..ఆ తర్వాత బోయపాటితో చేసిన జయ జానకీ నాయక మూవీతో మా ఆర్ధిక కష్టాలు మొత్తం తీరిపోయాయి అని తెలిపాడు..