
White Hair మనకు ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. మనం తినే ఆహారాలే మనకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మన వెంట్రుకలు నల్లబడటానికి ఎన్నో పరిహారాలు చేస్తుంటాం. చిన్నతనంలో జుట్టు తెల్లగా మారడం, తెల్లబడిపోవడం వంటి చర్యలతో బాధపడుతుంటాం. నలుగురిలో తిరగలేక అవమానంగా ఫీలవుతాం.
తెల్ల జుట్టును నల్లగా చేసుకునే వాటిలో గోరింటాకు, మందార ఆకు, పువ్వులు, గుంటలగరగర ఆకు, కరివేపాకు, ఉసిరికాయ, నానబెట్టిన మెంతులు, అలవేరా తీసుకోవాలి. వీటిని మెత్తగా నూరుకుని జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీనికి ఏం చేయాలంటే గుప్పెడు గోరింటాకు, గుప్పెడు మందారాకులు, పువ్వులు, గుప్పెడు గుంటల గరగర ఆకు, ఒక ఉసిరికాయను ముక్కలు చేసుకోవాలి. నానబెట్టిన మెంతులు కొన్ని తీసుకోవాలి. వీటిని కలిపి పేస్టుగా తయారు చేసుకోవాలి.
ఇందులో అలోవేరా ను కూడా పేస్టులా చేసుకుని వేసుకోవాలి. దీన్ని జుట్టుకు రాసుకుంటే మన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. దీంతో వీటితో జుట్టుకు ఎంతో మేలు కలుగుతుంది. పూర్వం రోజుల్లో వీటితో జుట్టుకు ఎంతో ఉపయోగకరంగా చేసుకునే వారు. కాలక్రమంలో జుట్టుకు సంబంధించిన వాటిలో ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుంది.
ఇలా జుట్టును నల్లగా చేసుకోవడంలో ఇది మనకు ఎంతో సాయపడుతుంది తెల్ల వెంట్రుకలు నల్లగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మారేందుకు ఇవి చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో వీటితో తలకు కూడా ఎంతో బాగుంటుంది. తల నొప్పి వంటివి కూడా లేకుండా పోతాయి. వీటి సాయంతో తెల్ల వెంట్రుకలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.