29.6 C
India
Friday, May 16, 2025
More

    Benefits OTT : ఓటీటీతో ఎవరికి లాభం.. హీరోల‌కా, నిర్మాత‌ల‌కా?

    Date:

    Benefits OTT
    Benefits OTT

    Benefits OTT : కరోనా పుణ్యమాని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారాలు అనేకం వెలిశాయి. వీటి తర్వాత సినిమా స్వరూపం, స్వభావం పూర్తిగా మారిపోయింది. ప్రతీ సినిమాకు రిలీజ్ కు ముందే భారీ మర్కెటింగ్ ఓపెన్ అయ్యింది. సినిమాకు ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ రైట్స్ అంటూ నిర్మాతలకు సినిమా రిలీజ్ కంటే ముందే డబ్బులు చేతికి అందుతున్నాయి. దీంతో ప్రొడ్యూసర్ అప్పుల ఊబి నుంచి బయటపడుతున్నాడు. కొవిడ్ లాక్ డౌన్ కాలంలో సినిమాలను ఓటీటీలే కాపాడాయి అన్నది జగమెరిగిన సత్యమే కదా. ఓటీటీతో నిర్మాతల కంటే హీరోలకే ఎక్కువ లాభం కలుగుతుంది. చేసిన సినిమాకు సంబంధించి దాదాపు 30 శాతం ఓటీటీ రూపంలో ప్రొడ్యూసర్ చేతికి వస్తుంది. అయితే ఇది పెద్ద సినిమాల విషయంలో లాభసాటిగా ఉంటుంది. దీన్ని హీరోలు కూడా క్యాష్ చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

    ఇటీవ‌ల ఒక భారీ ప్రొడ్యూసర్ మాస్ హీరో వద్దకు క‌థ తీసుకెళ్తే.. ‘నాన్ థియేటికల్ రైట్స్ నాకు ఇస్తే నేను ఈ సినిమా చేస్తాను’ అని చెప్పి ప్రొడ్యూసర్ కు షాక్ ఇచ్చాట. అయితే ఇందులో కూడా ఒక ఆఫర్ ఇచ్చాడట. ఇదే తనకు పారితోషికం అంటూ చెప్పాడట. అంటే ప్రొడ్యూసర్లకు కూడా థియేటికల్ రిలీజ్ తోనే తమకు కావాల్సిన డబ్బులు వస్తాయని అర్థం అయ్యింది. ఈ ఆఫర్ మంచిదే కదా..? అనిపించిందట. రెమ్యునరేషన్ కు బదులు ఓటీటీ రైట్స్. కానీ ఒక్కడే అతి పెద్ద రిస్క్ దాగి ఉంది. రాను రాను థియేటర్ కు వెళ్లి సినిమా చూసేందుకు జనాలు ఇష్టపడడం లేదు. దీంతో వసూళ్లు కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మొదటి రోజు మొదటి షో టాక్ పాజిటివ్ గా వస్తే ఒకే.. కానీ ఏ మాత్రం నెగెటివ్ టచ్ చేసినా ఓటీటీలో చూద్దాంలే అని ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లడం లేదు.

    దీన్ని కూడా నిర్మాతలు దృష్టిలో పెట్టుకుంటున్నారు. నికరంగా వచ్చే నాన్ థియేటికల్ రైట్స్ హీరోలకు ఇస్తే ఇటు థియేటర్ లో సినిమాలు ఆడక, అటు డిజిటల్ రైట్స్ డబ్బులు రాక నిర్మాతలు రోడ్డున పడతారు. అయితే ఒకటి, రెండు హిట్లు ఉన్న వారు కూడా ఇలానే అడుగుతున్నారట. సినిమా చేసే ముందు డిజిల్ రైట్స్ అమ్ముకుంటే నిర్మాత అప్పుల ఊబి నుంచి బయట పడతాడు. కానీ వాటి హక్కులను కూడా హీరోలకు రాసిస్తే ఇక చిప్పే గతని చాలా మంది అనుకుంటున్నారు. హీరోల మాయలో పడిన ప్రొడ్యూసర్లు దీనికి ఒప్పుకుంటారు. కానీ కళామతల్లిని కలకాలం కాపాడుకునే ప్రొడ్యూసర్ మాత్రం దీని నుంచి తప్పుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Apple products : భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు: టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్

    Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Saraswati Pushkaram : నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు షురూ

    వేకువ జామున లాంఛనంగా ప్రారంభం - సాయంత్రం సీఎం దంపతులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Annochindu Promo : ‘ఆహా’లోకి కమెడియన్ ఎంట్రీ.. ‘అన్నొచ్చిండు..’ ప్రోమో వైరల్

    Annochindu Promo : సుడిగాలి సుధీర్ వెండితెరపై తనను తాను నిరూపించుకునేందుకు...

    Tolly wood : రీమేక్ లతో చేతులు కాల్చుకుంటున్నారు.. ఇక టాలీవుడ్ తీరు మారదా?

    Tolly wood : తెలుగులో ప్రస్తుతం రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది....