
Six pack : తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట హీరోల మధ్య వివాదం నెలకొంది. ఇండస్ట్రీలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసింది సూర్య అని ఆయన తండ్రి శివకుమార్ ఓ కార్యక్రమంలో అన్నారు. అతడిలా ఎవరూ కష్టపడలేరని కామెంట్ చేశారు. దీనిపై విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ చేసింది ధనుష్. ఆ తర్వాత ‘సత్యం’ కోసం నేను చేశాను’ అని గుర్తుచేశారు. ఇది కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.