30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Dhoni Aunt : రూ.800 కోట్ల కంపెనీని నడుపుతున్న ధోనీ అత్త.. ఆమె ఎవరంటే..

    Date:

    Dhoni aunt
    Dhoni aunt, Dhoni mother in law

    Dhoni Aunt : క్రికెట్ లో జార్కండ్ డైనమెట్ మహేంద్రసింగ్ ధోని అంటే ఎందరికో ఇష్టం. అయితే ధోనీ ఓ అతిపెద్ద కంపెనీని నడుపుతున్నాడు. అయితే ఈ కంపెనీని ఒక మహిళ చూసుకుంటున్నారు. సీఈవోగా ఈమె అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె ఎవరో కాదు.. షీలా సింగ్‌. ధోనీకి స్వయంగా అత్తగారే. ధోనీ ఇటీవల ఐపీఎల్ టైటిల్ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సారథి. అయితే ఆయన అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఒక కంపెనీని షీలా సింగ్ నిర్వహిస్తున్నారు.

    ధోని నిర్మాణ సంస్థ అయిన ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా షీలా సింగ్ ఉన్నారు, కోట్లాది రూపాయల వ్యాపారం ఆమె నిర్వహిస్తున్నారు. ధోనీ సతీమణి సాక్షి సింగ్ కు షీలాసింగ్ తల్లి. అందుకే అత్తగారికి ఈ వ్యాపార నిర్వహణ బాధ్యతను ధోనీ అప్పగించాడట. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన కుటుంబంలో వారు చూసుకుంటేనే బాగుంటుందని ధోనీ భావించే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓలుగా సాక్షి ధోనీ, షీలా సింగ్ లను ప్రమోట్ చేశాడట. వీరిద్దరూ 2020 నుంచి ఈ కంపెనీ బాధ్యతలను చూసుకుంటున్నారు. అయితే షీలా సింగ్ ఓ  కంపెనీకి అధిపతిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. తల్లీకూతుళ్ల  సారథ్యంలో ఎంఎస్ ధోనీ ప్రొడక్షన్ హౌస్ ఎంతో ఉన్నతంగా ముందుకెళ్తున్నదట. మిలియన్ డాలర్ల బేస్‌ని కలిగిన ఈ సంస్థ, కొత్త ప్రాజెక్ట్‌లను విడుదల చేసిందట.

    మరోవైపు షీలా సింగ్ భర్త ఆర్కే సింగ్, ధోని తండ్రి పాన్ సింగ్ ధోనీతో కలిసి కనోయ్ గ్రూప్ యొక్క ‘బినాగురి టీ కంపెనీలో గతంలో పని చేసేవారు. అయితే షీలాసింగ్ గృహిణి. ప్రస్తుతం ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌కు షీలా సింగ్, సాక్షి ధోనీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో, కంపెనీ నికర విలువ రూ. 800 కోట్లకు పైగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. సాక్షి ధోని ప్రస్తుతం ఎంఎస్ ధోని ప్రొడక్షన్ హౌస్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ధోనీ వ్యాపార సామ్రాజ్యం వేలకోట్లలోనే ఉంటుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అంటే ధోనీ అటు ఆటలోనూ. ఇటు వ్యాపార రంగంలోనూ డైనమెట్ అన్నమాట. ఏదేమైనా ఆటగాళ్లు, సినిమావాళ్లు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడం సర్వసాధారణమే కదా.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...