37.5 C
India
Friday, March 29, 2024
More

    Nizamabad Artist : నిజామాబాద్ గడ్డ నుంచి వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న వారెవరో తెలుసా..?

    Date:

    Nizamabad Artist : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీని ఎక్కువగా ఆక్రమించింది ఆంధ్రా వాళ్లే అని చెప్పవచ్చు. ఎక్కువ మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు, కో ఆర్టిస్ట్ లు కూడా అక్కడి నుంచే ఉంటారు. కానీ తెలంగాణ నుంచి వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న వారి గురించి తెలుసుకుందామా.

    తెలంగాణ ప్రాంతం ఒకే జిల్లా నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఆ జిల్లా ఏంటంటే నిజామాబాద్. అక్కడి నుంచి వచ్చి బుల్లితెర, వెండితెర నుంచి వచ్చిన హీరోలు, నిర్మాతలు, యాంకర్లు, కమెడియన్లు అనేక రంగాల్లో ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.

    దిల్ రాజు
    నిర్మాతగా ఈ పేరు ప్రతి ఒక్కరికీ పరిచయమే. నిర్మాతగా వందలాది చిత్రాలు తీసిన ఆయన గతంలో డిస్ట్రిబ్యూటర్ గా కూడా పని చేశాడు. దర్శకులను ఒప్పించి సినిమాలు ప్రొడ్యూస్ చేసి సక్సెస్ చేసుకోవడంలో ఆయన తర్వతే ఎవరైనా. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు దిల్ రాజు. దిల్ రాజు నిజామాబాద్ జిల్లాకు చెందిన వాడే.

    హీరో నితిన్
    నితిన్ కూడా నిజామాబాద్ నుంచే వచ్చాడు. ఈ హీరో తండ్రి సుధాకర్ రెడ్డి నైజాంలో డిస్ట్రిబ్యూటర్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇక నితిన్ తేజ దర్శకత్వం వహించిన ‘జయం’తో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో పాతుకుపోయాడు.

    యాంక‌ర్ శ్రీముఖి
    బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖిది కూడా నిజామాబాద్ జిల్లానే. ఆమె దగ్గరి బంధువులు ఇప్పటికీ నిజామాబాద్ లోనే ఉన్నారని తెలుస్తోంది. యాంకర్ గా ఇండస్టీకి వచ్చిన శ్రీముఖి తక్కువ సమయంలోనే గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

    వెన్నెల కిషోర్
    టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో వెన్నెల కిశోర్ ఒకరు. ఆయనది కూడా నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి మండలం. అక్కడే పుట్టి పెరిగిన ఆయనకు సినిమాలపై మక్కువ ఎక్కువ. అందుకే ఉద్యోగం నెపంతో హైదరాబాద్ కు వచ్చి మెల్లమెల్లగా ఇండస్ట్రీలో పాతుకుపోయారు ఆయన.

    అదితిమ్యాక్యాల్
    అదితి మ్యాక్యాల్ ది నిజామాబాద్ జిల్లానే. కానీ ఆమె తండ్రి ఉద్యోగరిత్యా హైదరాబాద్ కు వచ్చి అక్కడే సెటిల్ అయ్యాడు. దీంతో కుటుంబం మొత్తం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. అదితి మ్యాక్యాల్ కు నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి వెళ్లింది.

    చమ్మక్ చంద్ర
    జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షో మొదటి నుంచి ఉన్న ఆయన షోకే వన్నె తెచ్చారనడంలో సందేహం లేదు. దీంతో పాటు స్టార్ కామెడీ, అదిరింది లాంటి షోలలో కూడా ఆయన పాల్గొన్నారు. సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ఆయన కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వాడే.

    యాంక‌ర్ శివ‌జ్యోతి
    యాంకర్ శివజ్యోతి ఈవెంట్లు, షోలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమెది కూడా నిజామాబాద్ జిల్లానే. అక్కడే పుట్టి, అక్కడే చదువు కూడా పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం బుల్లితెర షోలలో యాంకర్ గా కొనసాగుతుంది.

    Share post:

    More like this
    Related

    K Keshava Rao : BRS కు ఎంపీ కె. కేశవరావు రాజీనామా..

    K Keshava Rao : రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు...

    TDP : తమ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ..

    TDP : పోరాడి భీమిలీ టిక్కెట్ ను  మాజీ మంత్రి గంట...

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nizamabad : నిజామాబాద్ లో పెంపుడు కుక్కని దొంగతనం చేసిన పోలీసులు!

      Nizamabad : పౌరులకు ఏ కష్టం వచ్చినా మాకు న్యాయం చెయ్యడానికి...

    Producer Dil Raju : ఇందూరు బరిలో దిల్ రాజు..రేవంత్ నిర్ణయమే ఫైనల్

    Producer Dil Raju : మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు ముగించుకుని.. మరో...

    Nizamabad Crime : నమ్మిన స్నేహితుడే నర హంతకుడు.. సంచలనం రేపిన ఆరుగురి హత్య

    Nizamabad Crime : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది....

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...