- 2024లో పాగా వేసేదేవరు..

Gudivada : ఏపీలోని గుడివాడ నియోజవకర్గంపై ఈ సారి రెండు ప్రధాన పార్టీల కన్ను పడింది. ఇటు అధికార వైసీపీ నుంచి ఇప్పటికే ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని ఆ నియోజకవర్గం నుంచి బలమైన నేతగా ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలుపై లేచే నేతగా ఆయనకు పేరుంది. బూతుల మంత్రిగా కూడా ఆయనకు పేరు వచ్చిందంటే కొడాలి నాని ఎలా మాట్లాడుతారో తెలుగు రాష్ర్టాల ప్రజలందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గాన్ని టీడీపీ కూడా చాలెంజ్ గా తీసుకుంది. ఈ సారి ఎలాగైనా కొడాలి నానికి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నది. అక్కడ ఆయనను ఓడించి, ఇక నానిని ఇంటికే పరిమితం చేయాలని పావులు కదుపుతున్నది.
అయితే గుడివాడలో పోటీలో ఉండే ముఖ్య అభ్యర్థుల వీరే..
వైసీపీ నుంచి కొడాలి నాని ఇక్కడ రాష్ర్ట స్థాయిలో కీలక నేత ఉన్నారు. ఆయన రెండు సార్లు టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్ చెంత చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వార్తలో నిలుస్తుంటాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో కొడాలి వెంకటేశ్వర్రావు(నాని) ఘన విజయం సాధించారు. ఈసారి కూడా ఆయన గట్టి పోటీదారుగా నిలిచే అవకాశముంది. ఇప్పటికే నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇక టీడీపీ నుంచి ఈసారి పలువురు ప్రముఖుల పేరు వినిపిస్తున్నది. రావి వెంకటేశ్వర్ రావు, నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని, తో పాటు మరికొందరు కీలక నేతల పేరు వినిపిస్తున్నది. పార్టీ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతోందో వేచి చూడాల్సి ఉంది. గుడివాడ నియోజకవర్గంలో అన్న ఎన్టీఆర్కు బలమైన అభిమానులు ఉన్నారు. అయితే కొడాలి నానిని ఢీకొట్టాలంటే టీడీపీ అస్థాయిలో ముఖపరిచయం ఉన్న వ్యక్తిని అక్కడ పోటీలో పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో ఇటీవల మృతి చెందిన హీరో తారక రత్న సతీమణి ఆలేఖ్య పేరు కూడా ప్రస్తావనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇక్కడ సీరియస్ వర్క్ చేస్తున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో అసభ్య పదజాలంతో దూషించే నానికి ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు కావాలని, అక్కడ తనకు దీటుగా ఒక నేతను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.
గుడివాడ నియోజకవర్గం డీటైల్స్..
జిల్లా – కృష్ణ
నియోజకవర్గం- గుడివాడ
లోక్ సభ- మచిలీపట్నం
మండలాలు – 3
ఓటర్లు – 2,08,950