
Allu Arjun : పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తర్వాతి సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే సినిమా దాదాపు ఖాయమైందట. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించే అవకాశం ఉందట.
దర్శకుడు అట్లీ ఆమెతో చర్చలు జరిపారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ప్రియాంక చోప్రాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. అందుకే అల్లు అర్జున్ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆమెను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది.