27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Harish Shankar : ఆ ముస‌లి న‌క్క ఎవ‌రు? జర చెప్పండి శంక‌రా?!

    Date:

    Harish Shankar
    Harish Shankar

    Harish Shankar : టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి పరిచయం అవసరం లేదు కదా.. సాధారణంగా బయటకు కనిపించని తక్కువ మంది డైరెక్టర్లలలో ఆయన కూడా ఒకరు. తనపై వచ్చే కామెంట్లను లక్ష్య పెట్టడు, గాసిప్పులు రాసి బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకునే వారికి ధీటుగా సమాధానం ఇస్తాడు. తనపై అవాక్కులు, చెవాక్కులు పేలుతున్న వారిని పట్టించుకోడు. ఇంకా బరితెగిస్తే మాత్రం తాట తీస్తాడు. ‘హరీష్ శంకర్ కు ప్రస్తుతం సినిమాలు లేవని అందుకే ఫ్రస్టేషన్ ఎక్కువైందని, రాత్రంతా తాగుతున్నాడ‌ని ఓ వెబ్ సైట్ రాసింది. దీంతో ‘నాకు సోడా పోశావా.. పెగ్గు క‌లిపావా’ అంటూ డైరెక్ట్ ఎటాక్‌ ఇచ్చాడు ఆయన. ఆ ఫంక్షన్ లో హ‌రీష్ స్పీచ్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

    ఇప్పుడు మ‌రోసారి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న జర్నలిస్ట్ పై ఆయనకు పట్టరాణి కోపం వ‌చ్చింది. ‘రిలీజ్ టైమ్ దగ్గర పడుతుంది కదా.. ఏం పోస్ట్ చేసినా భ‌య‌ప‌డి త‌గ్గుతాడు అని, ఒక ముస‌లి న‌క్క మ‌ళ్లీ మొద‌లు పుడుతోంది. ద‌య చేసి అలాంటి అపోహ‌లు పెట్టుకోవద్దుని నా మ‌న‌వి. నా జోలికొస్తే రేపు రిలీజ్ అన్నా వ‌ద‌ల‌ను’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

    హ‌రీష్ శంక‌ర్ – ర‌వితేజ‌ కాంబోలో రూపుదిద్దుకున్న ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’ కూడా లైన్ లో ఉంది. ఈ రెండు మూవీలపై ఓ వెబ్ సైట్ నెగెటివ్ రాతలు రాస్తోంది. ఆ వెబ్ సైట్ పేరు చెప్పుకుని తిరిగే ఓ జర్నలిస్ట్ త‌న ఎక్స్ లో ఈ రెండు సినిమాల్ని ఉద్దేశించి త‌ప్పుడు వార్తలు రాస్తున్నాడ‌ని హ‌రీష్ వార్నింగ్ ఇవ్వాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం హ‌రీష్ ట్వీట్ వైర‌ల్ గా మారింది. ‘నువ్వు ఏమాత్రం తగ్గొదన్నా..’ అంటూ ఫ్యాన్స్ కూడా హ‌రీష్ కు సపోర్ట్ చేస్తున్నారు. ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఎంత తీస్తే అంతా రిలీజ్ చేసేయ్‌. స‌గం సినిమా ఉన్నా, హిట్ చేస్తాం’ అంటూ పవన్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో గోల చేస్తున్నారు. దీంతో ఆ ముస‌లి న‌క్క ఎవ‌రూ..? అంటూ అంద‌రూ ఆరా తీయడం మొదలు పెట్టారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...