Samantha’s best friend :
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత కొన్ని రోజులు డీప్రెషన్ లోకి వెళ్లింది. తర్వాత కోలుకొని తన కెరియర్ పై ఫోకస్ పెట్టింది. డైవర్స్ విషయంలో ఎప్పుడూ ఎవరినీ తప్పుపట్టలేదు సమంత. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సమంత తన అభిమానుల కోసం మంచి, చెడులను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆయన ఫొటోలను ఇటీవల తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది సమంత.
రాహుల్ రవీంద్రన్ ఒక రెస్టారెంట్ లో తినే ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఆయనంటే తనకు ఎప్పటికీ ఇష్టమని చెప్పిన ఆమె, తన కోసం అతను చేసే ప్రత్యేకమైన విషయాలను కూడా పంచుకుంది. ‘మీకు నచ్చిన ఒక వ్యక్తిని ఎంచుకొని దాన్ని దాన్ని వందకు రెట్టింపు చేయండి.. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. అయితే నాకు నచ్చిన వ్యక్తి మాత్రం ఎప్పటికీ రాహుల్ రవీంద్రన్ అని చెప్పింది.
సమంత, రాహుల్ స్నేహం గురించి..
రాహుల్ రవీంద్రన్-సమంత మంచి సన్నిహితులు. అతడు డైరెక్టర్ కమ్ యాక్టర్ కాగా.. సమంత పాన్ ఇండియా హీరోయిన్. రవీంద్రన్ సమంత జీవితంలో చాలా ఘట్టాలలో ఆమె వెనకే ఉన్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ, నాగ చైతన్యతో పెళ్లి, డైవర్స్, వయోసైటిస్ ఇలా ప్రతీ విషయంలో ఆయన సమంతకు అండగా నిలిచాడు. సమంత వయోసైటిస్ కు గురవడంతో ఆయన ప్రతీ సారి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ‘ఆమె ఉక్కు మహిళ’ అని రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశాడు. లేడీ ఓరియండెట్ మూవీ యశోద చూసిన తర్వాత రాహుల్ రవీంద్రన్ సమంతను అభినందించారట. వయోసైటిస్ వేధిస్తున్నా.. ఎక్కడా ఆ ఛాయలు కనిపించనీయకుండా బాగా నటించావు అంటూ మెచ్చుకున్నారట.
రవివర్మన్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్కోయిన్ కావేరి’ చిత్రంలో సమంత-రాహుల్ జంటగా నటించారు. అప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. తన భార్య చిన్మయి శ్రీపాదతో కూడా సమంత చాలా సన్నిహితంగా ఉంటారు. నిజానికి సమంత నటించిన చాలా సినిమాలకు ఆమే డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా వ్యవహరించారు. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ మూవీ ‘ఖుషి’ చేస్తుంది. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.