
who is the child : మాతృదినోత్సవం సంద్భంగా ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ తమ తల్లులతో దిగిన ఫొటోలను షేర్ చేసుకున్నారు. అమ్మపై తమ ప్రేమను కవితల రూపంలో, చిన్న నాటి తీపి గుర్తుల రూపంలో సోషల్ మీడియా వేదికగా చాలా మంది పంచుకున్నారు. ప్రముఖులు, వీఐపీలు ఇలా ప్రతి ఒక్కరూ వారి బాల్య జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. అమ్మను మించిన దైవమున్నదా అంటూ మాతృదినోత్సవ శుభాకాంక్షలను చేసుకున్నారు.
అయితే ఇలాంటిదే ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతున్నది. అమ్మ చేతిలో ముద్దుగా చూడముచ్చటగా కనిపిస్తున్న బాబు ఫొటో అది. అలా అమ్మ చేతిలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు.. ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయనే ఈ ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులు, అనుచరులతో పంచుకున్నారు. మనకు జన్మనిచ్చి, ఒక మంచి జీవితాన్నిచ్చి, మన క్షేమాన్ని జీవితాంతం కాంక్షించే అమ్మ ప్రేమ వెలకట్టలేనిదంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో చెప్పుకొచ్చారు. దీంతో వారిద్దరిని చూసి అంతా ప్రేమగా లైక్ కడుతున్నారు.
మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లిపై ప్రేమను చాటుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పంచుకున్న ఈ ఫొటో ప్రస్తతుం వైరల్ గా మారింది. దీనిని అభిమానులు కూడా రీషేర్, రీ ట్వీట్ చేస్తున్నారు. ఇలా మరికొందరు కూడా తమ సోషల్ ఖాతాల్లో తల్లులపై ప్రేమను చాటుతూ పోస్టులు పెట్టారు. ఇందులో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారు. పసిప్రాయంలో తమ తల్లులతో దిగిన ప్రముఖుల ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.