Facebook :
మనం ఫేస్ బుక్ ఓపెన్ చేయగానే ఓ అమ్మాయి ఫొటో కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె కూడా మన ఇండియనే. కాకపోతే ఫారిన్ లో స్థిరడింది. యూట్యూబ్ లో ఎన్నో ప్రకటనలు వస్తుంటాయి. కానీ ఆ అమ్మాయి గురించి మాత్రం ఎవరికి అంతగా తెలియకపోవడం సహజం. ఈనేపథ్యంలో ఆ అమ్మాయి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఫేస్ బుక్ ప్రకటనల ద్వారా యూ ట్యూబ్ లో ఫేమస్ అయిన ఈ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. ఈమె గురించి చాలా మందికి తెలియదు. ఈ యాడ్ చూసిన వారికి అమ్మాయి ఎవరనే అనుమానం వ్యక్తం చేస్తుంటారు. ఈమె ఇండియాకు చెందినదే. మైనర్ అండ్ మార్కెటింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో పూర్తి చేసింది. బిజినెస్ ఎకనామిక్స్ లో ప్రిన్సిపుల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసింది.
సామాజిక మాధ్యమాల్లో చలాకీగా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ప్రైవేట్ లో ఉంది. కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతుంది. ఏఐ టెక్నికల్ రీక్రుటర్ , మార్కెంటింగ్ మీడియా మేనేజర్, ఫేస్ బుక్ లో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తోంది. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్ కో రా బ్లాక్స్ లో రీక్రుటింగ్ మేనేజర్ గా పనిచేస్తోంది. ఉద్యోగం చేస్తూనే మరో వైపు కేరింగ్ హ్యాండ్స్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది.
కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి సాయం చేసింది. ఉద్యోగం కోల్పోయిన వారికి చాలా హెల్ప్ చేసింది. 2020లో నుపుర్ సాహిల్ అనే అతడిని అక్టోబర్ 17న వివాహం చేసుకుంది. ఇలా ఆమె జీవితం పలు మలుపులు తిరిగింది. ఇలా నుపుర్ తన జీవితంలో చాలా మందిని తన సాయంతో ఆదుకుంది. ఫేస్ బుక్ లో కనిపించే నుపుర్ ఇన్ని రకాల సేవలు అందిస్తోంది.